చిలకలూరిపేట: చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజినిని గురువారం పోలీసులు పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు మండలాల్లో ఎక్కడా వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద వందల మంది టీడీపీ గూండాలు కర్రలు, రాడ్లతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై దాడులకు తెగబడ్డారు. యడ్లపాడులో నామినేషన్ వేసేందుకు వెళుతున్న వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను పోలీసులు అడ్డుకుని లాఠీచార్జి చేయడంతో, ఆగ్రహించిన అభ్యర్థులు జాతీయ రహదారిపై ధర్నా చేశారు. ఉప్పరపాలెంలో నామినేషన్ వేసేందుకు వెళ్లిన పల్లపు మంగయ్య భార్యపై దాడి చేసి నామినేషన్ పత్రాలు చించివేశారు. పోతవరం గ్రామానికి చెందిన రావెళ్ల పద్మ నామినేషన్ వేసేందుకు వెళ్లగా, టీడీపీ గూండాలు మహిళ అని కూడా చూడకుండా ఆమైపె దాడి చేసి నామినేషన్ పత్రాలు చించివేశారు.


