లలిత హాస్పిటల్‌కు రెండు పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

లలిత హాస్పిటల్‌కు రెండు పురస్కారాలు

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

గుంటూరు మెడికల్‌: గుంటూరు లలిత పీవీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌కు టైమ్స్‌ బిజినెస్‌ అవార్డ్స్‌ – ఆంధ్రప్రదేశ్‌ 2026లో రెండు పురస్కారాలు లభించాయి. విజయవాడలో నిర్వహించిన 8వ ఎడిషన్‌ టైమ్స్‌ బిజినెస్‌ అవార్డ్స్‌ కార్యక్రమంలో లలిత ఆసుపత్రి వైద్య సేవలకు గుర్తింపుగా ఈ అవార్డులను అందజేశారు. స్టేట్‌ ఆఫ్‌ ది ఆర్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో, వందకుపైగా డాక్టర్లతో, 40 క్లినికల్‌ స్పెషాలిటీస్‌, పూర్తి డయాగ్నోస్టిక్స్‌తో ప్రైమరీ నుంచి అడ్వాన్స్‌డ్‌ కేర్‌ వరకు రోగులకు లలిత పీవీఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ చికిత్స అందిస్తోంది. ట్రీట్‌మెంట్‌తోపాటుగా అకడమిక్‌ ఇన్‌స్టిట్యూట్‌, రీసెర్చ్‌ కార్యక్రమాలతో లీడింగ్‌ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్‌ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని ప్రముఖ నటుడు సోనూసూద్‌ చేతుల మీదుగా ఆసుపత్రి సీఈఓ, ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ అనురాగ్‌ పోలవరపు స్వీకరించారు. అత్యవసర వైద్య సేవల్లో అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ‘ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎమర్జెన్సీ కేర్‌’ అవార్డు లభించింది. ఈ పురస్కారాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి చేతుల మీదుగా ఎమర్జెన్సీ మెడికల్‌ స్పెషలిస్ట్‌ డాక్టర్‌ సత్యనారాయణ, డాక్టర్‌ షుకూర్‌ అందుకున్నారు. ఈ సందర్భంగా లలిత గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌, ప్రముఖ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పి.వి. రాఘవ శర్మ మాట్లాడుతూ వైద్యులు, సిబ్బంది సమష్టి కృషికి లభించిన గుర్తింపు ఇదన్నారు. వారిని అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement