టెట్‌ మెటీరియల్‌ వెంటనే విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

టెట్‌ మెటీరియల్‌ వెంటనే విడుదల చేయాలి

Sep 23 2026 2:12 AM | Updated on Sep 23 2026 2:12 AM

యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు

గుంటూరు ఎడ్యుకేషన్‌: ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు నిర్వహించే స్పెషల్‌ టెట్‌ పరీక్షకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్టడీ మెటీరియల్‌ వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. మంగళవారం బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ జిల్లా కార్యాలయంలో పీడీఎఫ్‌ టీచర్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి ఎం.హనుమంతరావుకు మద్దతుగా ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ టెట్‌ పరీక్ష ఫీజు చెల్లింపుకు ఒక్కరోజే గడువు ఉందని, పరీక్షకు సైతం 15 రోజులే వ్యవధి ఉన్న దృష్ట్యా స్టడీ మెటీరియల్‌ విడుదల చేయకపోవడంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. టెట్‌ రద్దు కోసం ఉద్యమం చేసిన సందర్భంలో ప్రభుత్వం మెటీరియల్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. సమయం మించిపోయాక ఇచ్చినా ఉపయోగం లేదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కళాధర్‌, గుంటూరు ప్రాంతీయ కేంద్ర బాధ్యులు షేక్‌ రెహమాన్‌, బి.నరసింహారావు, శ్రీనివాస్‌ కార్తీక్‌, రమేష్‌, ఎం. నరసింహారావు, రత్నకుమార్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement