ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి | - | Sakshi
Sakshi News home page

ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి

Sep 20 2026 6:42 AM | Updated on Sep 20 2026 6:42 AM

గుంటూరు వెస్ట్‌: ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. జిల్లా విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సమావేశం స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆధార్‌ లేని యానాది కులానికి చెందిన 531 మందిని గుర్తించామని, వారికి ఆధార్‌ కార్డులు జారీ చేస్తున్నామని చెప్పారు. గిరిజన భవన్‌ మరమ్మతుల పనులు మంజూరు చేశామన్నారు. అంబేడ్కర్‌ భవన్‌ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హాస్టల్స్‌లో అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. దాడులపై నిబంధనల మేరకు కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. కుల ధ్రువీకరణ పత్రాలపై వచ్చిన ఆరోపణలపై వారం రోజుల్లో పరిష్కరించనున్నట్లు చెప్పారు. మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహం అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని, ఆ మేరకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో సునిశితమైన కేసుల వివరాలు పోస్టు చేయరాదని స్పష్టం చేశారు. సమావేశంలో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, డీఆర్వో షేక్‌ ఖాజావలి, అదనపు ఎస్పీ జి.వి.రమణ మూర్తి, గుంటూరు, తెనాలి ఆర్డీఓలు కె.శ్రీనివాసరావు, కె.శ్రీరమణి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ జయలక్ష్మి, డీఎస్‌ఓ పి.కోమలి పద్మ, జిల్లా సాంఘిక సంక్షేమ, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి డి.దుర్గాబాయి పాల్గొన్నారు.

కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement