రేపటిలోగా బహిరంగ విచారణ పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

రేపటిలోగా బహిరంగ విచారణ పూర్తి చేయాలి

Sep 9 2026 3:04 AM | Updated on Sep 9 2026 3:04 AM

డీఆర్‌వో షేక్‌ ఖాజావలి

గుంటూరు వెస్ట్‌: ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ (ఎస్‌ఐఆర్‌) పెండింగ్‌ దరఖాస్తుల బహిరంగ విచారణ గురువారం నాటికి పూర్తి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి షేక్‌ ఖాజావలి స్పష్టం చేశారు. సర్‌పై తహసీల్దార్లతో మంగళవారం స్థానిక కలెక్టరేట్‌ నుంచి టెలీ కాన్ఫరెన్‌్స్‌ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలన్నారు. బుక్‌ ఏ కాల్‌ విధానంలో వచ్చిన అభ్యర్థనలను వేగంగా పరిష్కరించడానికి కనీసం గంటకు ఒకసారి యాప్‌ను సందర్శించాలని పేర్కొన్నారు. ఫారం 6,7,8 లలో వచ్చిన క్లెయిమ్‌పైనా దృష్టి సారించాలని తెలిపారు. నిబంధనల మేరకు కాలానుగుణంగా రాజకీయ పార్టీలకు వివరాలు అందించాల్సిన సమాచారాన్ని ఇవ్వాలని సూచించారు. బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌వోలు) తమ పరిధిలో గల పన్నెండు వందల మంది ఓటర్ల వివరాలు, ఫొటోలు విధిగా పరిశీలించాలని చెప్పారు. వాటిలో తప్పులు ఉన్నా, ఫొటో జత కాకపోయినా వారే బాధ్యులు అవుతారని తెలిపారు. ప్రతి విద్యాసంస్థలో ఓటరు అక్షరాస్యత క్లబ్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. జనగణన కింద విచారణ పూర్తి కావలసిన అంశాలపైనా దృష్టి సారించాలన్నారు. ఖాళీగా ఉన్న ఇళ్లు, తాళాలు వేసిన ఇళ్ల వివరాలు సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలని చెప్పారు. రెవెన్యూ సేవలు ప్రజలకు చేరువ చేయాలని పేర్కొన్నారు. రీ సర్వే వంటి ప్రక్రియపై స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది విస్తృతంగా ప్రజలతో మమేకం కావాలని పేర్కొన్నారు. ప్రజలకు త్వరితగతిన అన్ని రకాల సేవలు అందించాలని డీఆర్‌వోవివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement