మార్చురీలో సీసీ కెమెరాలు ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

మార్చురీలో సీసీ కెమెరాలు ఏర్పాటు

Sep 9 2026 3:04 AM | Updated on Sep 9 2026 3:04 AM

మార్చురీలో సీసీ కెమెరాలు ఏర్పాటు

గుంటూరుమెడికల్‌: నగరంలోని జీజీహెచ్‌ మార్చురీ విభాగంలో మంగళవారం ఆసుపత్రి అధికారులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ‘మార్చురీలో పైసాచికం’ శీర్షికతో మార్చురీలో మృతదేహం అప్పగించేందుకు మామూళ్లు తీసుకుంటున్నారనే విషయంపై ‘సాక్షి’ పత్రికలో ఈ నెల 4న కథనం ప్రచురితమైంది. గతంలో సీసీ కెమెరాలు ఉండేవి, నేడు కెమెరాలు లేకపోవడం వల్ల పలువురు వైద్య సిబ్బంది మార్చురీలో మృతదేహాలు అప్పగించేందుకు మామూళ్లు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయంటూ ప్రచురించడంతో ఆసుపత్రి అధికారులు స్పందించారు. సదరు ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement