యంత్రాలపైనా మాయ మాటలే! | - | Sakshi
Sakshi News home page

యంత్రాలపైనా మాయ మాటలే!

Sep 7 2026 3:02 AM | Updated on Sep 7 2026 3:02 AM

అరకొర కేటాయింపులే...

అనుమతుల కోసం ఎదురుచూపు

జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి సంబంధించి రైతుల నుంచి వచ్చిన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయింది. ఈ లబ్ధిదారుల ఎంపిక, లాటరీ నిర్వహణకు సంబంధించి ప్రస్తుతం ఉన్నతాధికారుల అనుమతుల కోసం వేచి ఉన్నాం. అవి రాగానే తదుపరి చర్యలు చేపట్టి, జిల్లా వ్యాప్తంగా యంత్రాల పంపిణీ కార్యక్రమాన్ని వేగంగా పూర్తి చేస్తాం.

వ్యవసాయ సాగు ఖర్చులు తగ్గించడం, కూలీల కొరతను అధిగమించడం కోసం ప్రభుత్వం ప్రకటించిన ఈ పథకం అమలు తీరుపై రైతుల్లో తీవ్ర అసంతృప్తిని ఉంది. ఈసారి యంత్రాల అందజేతకు ప్రభుత్వం జిల్లాకు రూ.3.30 కోట్ల మేర నిధులను కేటాయించింది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం, ఇతర రైతులకు 40 శాతం సబ్సిడీతో ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పవర్‌టిల్లర్లు, స్ప్రేయర్లు తదితర యంత్రాలు ఇస్తామని తెలిపింది. రైతుల అవసరాలకు సరిపడా యంత్రాలు లేకపోవడంతో జిల్లాలో అసంతృప్తి పెరుగుతోంది. జిల్లాలో 1,943 మంది రైతులు దరఖాస్తులు చేసుకోగా, ప్రభుత్వం కేటాయించింది 880 యంత్రాలే. అందులో ట్రాక్టర్ల కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. పదుల సంఖ్యలోనే వాటిని కేటాయించడం గమనార్హం.

సర్కారు యంత్రాల కోసం

1,943 మంది అన్నదాతల నిరీక్షణ

ఖరీఫ్‌ ముగుస్తున్నా ఇవ్వకపోవడంపై

తీవ్ర అసంతృప్తి

రూ.3.30 కోట్ల నిధులున్నా పథకం

అమలులో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం

కొరిటెపాడు (గుంటూరు): రాయితీపై వ్యవసాయ యంత్రాలను పొందే రైతులకు ప్రభుత్వం పలు కఠిన నిబంధనలను విధించింది. లబ్ధిదారులకు సొంత భూమి ఉండటంతో పాటు కనీసం మూడు సార్లు ఈ–పంట రికార్డుల్లో నమోదు చేయించి ఉండాలి. గతంలో ఎప్పుడూ ప్రభుత్వం నుంచి ఇలాంటి సబ్సిడీలు పొంది ఉండకూడదు. ఈ నిబంధనల ప్రకారం భూమి రికార్డులను సమర్పించిన రైతుల ఆన్‌లైన్‌ దరఖాస్తులను జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ స్వయంగా లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలా ఎంపికై న అర్హుల జాబితాపై జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి సంతకం చేసిన తర్వాత ఐదు రోజులకు సబ్సిడీ మొత్తం రైతుల ఖాతాల్లో జమ అవుతుందని ప్రభుత్వం పేర్కొంది. మే నెలలోనే 1,943 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ప్రక్రియ పూర్తయి నెలలు గడుస్తున్నా ఇంతవరకు రాయితీ ట్రాక్టర్లు, యంత్రాలను పంపిణీ చేయలేదు.

నిధులున్నా నిర్లక్ష్యమే..

పథకంలో భాగంగా ప్రస్తుత సంవత్సరానికి సబ్సిడీ ట్రాక్టర్లు, ట్రాక్టర్‌ సామగ్రి, స్ప్రేయర్లు, మినీ ట్రాక్టర్లలా తొమ్మిది రకాల యంత్రాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం గుంటూరు జిల్లా కోటా కింద 880 యూనిట్లకు రాయితీగా రూ.3.30 కోట్లను కేటాయించింది. ఇందులో ఇతరులు, జనరల్‌ కోటాకు రూ.2.55 కోట్లు, షెడ్యూల్డ్‌ కులాల కోటాకు రూ.58 లక్షలు, షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ) కోటాకు రూ.17 లక్షలను కేటాయించారు.

ఖరీఫ్‌ ముగుస్తున్నా..

ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై మూడు నెలలు కావస్తోంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే సుమారు 67 వేల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగయ్యాయి. సాగు పనుల ప్రారంభంలోనే సబ్సిడీ యంత్రాలను అందజేసి ఉంటే బాగుండేదని రైతులు అంటున్నారు. సీజన్‌ అంతా ముగిసిపోయిన తర్వాత ఇస్తే తమకేం లాభమని అన్నదాతలు పెదవి విరుస్తున్నారు. ఇప్పటికై నా కూటమి సర్కార్‌ స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

వైఎస్‌ జగన్‌ హయాంలో పండుగ..

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసిన వెంటనే ఏటా సబ్సిడీ ట్రాక్టర్లు, యంత్రాలు పారదర్శకంగా అందజేశారు. పంపిణీ చేసిన రోజే వాటికి సంబంధించిన సబ్సిడీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ వందలాది మంది ముందుకు వచ్చారు. అప్పట్లో ప్రతి సచివాలయానికి ఒక ట్రాక్టర్‌ మంజూరు చేశారు. ఇక వ్యవసాయ పరికరాలు అడిగిన రైతులందరికీ మంజూరు చేశారు. ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, వరికోత మిషన్లు, ట్రాక్టర్‌ సామగ్రి, రోటోవేటర్లు, స్ప్రేయర్లు అందజేశారు. నాడు రైతు సంక్షేమంపై ఎంతో శ్రద్ధగా ప్రభుత్వం పథకాలు అమలు చేసింది. కానీ నేడు టీడీపీ ప్రభుత్వంలో నిర్లక్ష్యమే కనిపిస్తోంది.

– ఎం.పద్మావతి,

జిల్లా వ్యవసాయ అధికారి, గుంటూరు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జిల్లాలోని అన్నదాతలకు కష్టాలకు తోడు ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు. రైతులను ఏ మాత్రం ఆదుకోని సర్కారు.. ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంట నష్ట పరిహారం, మద్దతు ధర కల్పించడం వంటి అన్ని విషయాల్లోనూ రైతులకు అన్యాయమే చేస్తోంది. తాజాగా సబ్‌ మిషన్‌ ఆన్‌ అగ్రికల్చరల్‌ మెకనైజేషన్‌ (ఎస్‌ఎంఏఎం) కింద సబ్సిడీ యంత్రాల పంపిణీ పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ, అమలు చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement