మాచర్ల: పట్టణంలోని ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద నిర్మితమవుతున్న ఇళ్ల పనులను రాష్ట్ర స్పెషల్ సెక్రెటరీ, హౌసింగ్ ఎండీ కొర్లపాటి హెప్సీబారాణి శనివారం ఆకస్మికంగా పరిశీలించారు. మాచర్ల వచ్చిన ఆమె ఆయా ప్రాంతాలలో నిర్మాణ దశలోని ఇళ వద్దకు వెళ్లారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. సీఈ టి.వేణుగోపాల్, పల్నాడు స్పెషలాఫీసర్ శంకరరావు, జిల్లా హౌసింగ్ పీడీ పి.ప్రసాద్, హౌసింగ్ మాచర్ల డీఈ బాలాజీ నాయక్, పల్నాడు జిల్లా డీఈలు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరావు, ఏఈలు తదితరులు ఉన్నారు.
పిడుగురాళ్ల రూరల్: జాతీయ వైద్య పరిశోధన మండలికి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ – చైన్నె ఆధ్వర్యంలో ‘ట్రామా – బర్న్ ఇన్‌జ్యురి– ఆపరేషనల్ రీసెర్చ్ ప్రోగ్రామ్’కు పిడుగురాళ్ల మెడికల్ వైద్య కళాశాల చెందిన డాక్టర్ కోమేరా శివ రామ ప్రసాద్ ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన జనరల్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ అధ్యయనానికి జాతీయ స్థాయిలో ఎంపికై న ఎనిమిది మందిలో ఆయన ఒకరు. రోడ్డు ప్రమాద బాధితులపై తాము పరిశోధన చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ను ప్రభుత్వ వైద్యశాల వైద్యులు, సిబ్బంది అభినందించారు.
మంగళగిరి రూరల్: జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఎయిమ్స్‌లో ఫిట్‌నెస్ అండ్ వెల్‌నెస్ సెంటర్‌ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సీఈఓ ప్రొఫెసర్ అహంతేం శాంతా సింగ్ శనివారం ప్రారంభించారు. ఎయిమ్స్ సిబ్బంది, విద్యార్థుల ఆరోగ్యం, ఫిట్‌నెస్, శ్రేయస్సును ప్రోత్సహించేలా కేంద్రంలో పురుషులు, మహిళలకు ప్రత్యేక వ్యాయామశాలలు అందుబాటులో ఉంచారు. కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ (పరిపాలన) కల్నల్ శశికాంత్ తుమ్మ, విభాగాధిపతులు, క్రీడా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలని విద్యాహక్కు చట్టంలో ఉన్న నిబంధనల సవరణ కోసం పాఠశాల విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 3వ తేదీన తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమం పోస్టర్లను శనివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆవిష్కరించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఉపాధ్యాయులు తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర విద్యా శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి, విద్యాహక్కు చట్టంలోని సవరణ చేయాలని డిమాండ్ చేశారు. టెట్ రద్దు కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులందరూ బైక్ ర్యాలీలు చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో చలో విజయవాడ కార్యక్రమానికి తరలి రానున్నారని చెప్పారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రచురణల విభాగ చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 60 వేల మంది ఉపాధ్యాయుల ఆవేదనను విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి లోకేష్ అర్థం చేసుకోవాలని, టెట్‌లో సవరణకు ప్రయత్నించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యు.రాజశేఖర్ రావు, ఎం. కళాధర్, జిల్లా సహాధ్యక్షులు వెంకటేశ్వర్లు, ఎండీ షకీలా బేగం, ఆది నారాయణ, రంగారావు, ప్రసాద్, ఎం.కోటిరెడ్డి, గఫార్ తదితరులు పాల్గొన్నారు.


