● సీఐటీయూ పల్నాడు జిల్లా కార్యదర్శి గుంటూరు విజయ్ కుమార్
సత్తెనపల్లి: విద్యారంగ పరిరక్షణకు భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్‌ఎఫ్‌ఐ) ఉద్యమించాలని సీఐటీయూ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు గుంటూరు విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శనివారం జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ సత్తెనపల్లి నియోజకవర్గ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. మహాసభకు అధ్యక్ష వర్గంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రియాజ్, డి. అమూల్య, వెంకీలు వ్యవహరించారు. విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యారంగ ప్రైవేటీకరణతో పేద విద్యార్థులకు పాలకులు చదువును దూరం చేస్తున్నారన్నారు. క్రీడలకు ప్రైవేట్ విద్యాసంస్థలు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కో కన్వీనర్ డి. అమూల్య గత కార్యకలాపాల నివేదికను మహాసభలో ప్రవేశపెట్టారు. ప్రతినిధులు చర్చలు జరిపి ఏకగ్రీవంగా ఆమోదించారు. కార్యచరణ ప్రణాళికను రూపొందించారు. పలు తీర్మానాలను భువనేశ్వరి, నవీన్‌లు ప్రవేశపెట్టగా, అమతవర్షిణి బలపరిచారు. మహాసభ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఆమోదించారు. 22 మందితో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష, కార్యదర్శులుగా షేక్ రియాజ్, జె. సాయికుమార్, ఉపాధ్యక్షులుగా భువనేశ్వరి, అమృతవర్షిణి, సహాయ కార్యదర్శులుగా జానీ శంకర్, ఆగస్టిన్, వెంకీ, కమిటీ సభ్యులుగా నవీన్, దిలీప్, వెంకటేష్, సుధాకర్, లక్ష్మయ్య, ప్రశాంత్, లిఖిత, శ్రీవిద్య, ఆంజనేయులు, భార్గవి, దావీదు, నవీన్, బాషా, దిలీప్, అల్తాఫ్, సంజయ్ మనోహర్‌లను ఎన్నుకున్నారు. పరిశీలకులుగా ఎస్‌ఎఫ్‌ఐ పల్నాడు జిల్లా కన్వీనర్ సాయి హాజరయ్యారు. కౌలు రైతు సంఘం సత్తెనపల్లి మండల కార్యదర్శి పి. మహేష్, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు నీరుకొండ కృష్ణ, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు గద్దె ఉమాశ్రీలు సందేశం ఇచ్చారు. ముందుగా ఎస్‌ఎఫ్‌ఐ జెండాను షేక్ రియాజ్ ఆవిష్కరించారు. నాయకులు అభిలాష్, ఆసిఫ్, సీఐటీయూ సత్తెనపల్లి పట్టణ కన్వీనర్ జె. రాజకుమార్ నాయకత్వం వహించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.


