నకరికల్లు: స్థానిక వంగా వెంకటరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉమ్మడి గుంటూరు జిల్లా జూనియర్ బాలబాలికల ఖో–ఖో జట్ల ఎంపికలు ఆదివారం నిర్వహించనున్నట్లు జిల్లా ఖో–ఖో అసోసియేషన్ అధ్యక్ష,కార్యదర్శులు వీరభద్రారెడ్డి, చింతా పుల్లయ్య శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడాకారులు 2008 అక్టోబర్ 31 తర్వాత జన్మించిన వారై ఉండాలన్నారు. వయస్సు, ఎత్తు, బరువు కలిపి 250 పాయింట్లు మించకుండా ఉండాలన్నారు. హాజరయ్యే క్రీడాకారులు ఆధార్‌కార్డు తప్పనిసరిగా తెచ్చుకోవాలన్నారు. ఎంపికై న జట్లు సెప్టెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు ఎన్‌టిఆర్ జిల్లా కంచికచర్లలో నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. వివరాలకు ఫిజికల్ డైరెక్టర్ జి.ఝాన్సీరాణి 9949533234, 9866925108 నంబర్లను సంప్రదించాలని కోరారు.


