పెదకాకానిలో భారీ చోరీ | - | Sakshi
Sakshi News home page

పెదకాకానిలో భారీ చోరీ

Jul 12 2026 3:11 AM | Updated on Jul 12 2026 3:11 AM

రైతులు ఐక్యంగా ఉండాలి బలవంతంగా బయటకు ఈడ్చారు అడిగితే సమాధానం చెప్పలేదు

రైతులందరూ కలిసి కట్టుగా ఉండాలి. లేదంటే ప్రభుత్వం దౌర్జన్యం చేస్తుంది. రెండు, మూడు నెలలుగా ఉండవల్లి, పెనుమాక రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. కలిసి కట్టుగా ముందుకు వెళితే ప్రభుత్వం ఏమీ చేయలేదు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా, ఏ రైతుకు కష్టం వచ్చినా ఐక్యంగా పోరాడాలి.

– బోసిరెడ్డి, రైతు

పొలంలో పనులు చేసుకుంటున్నాం. సమాధానం చెప్పకుండా జేసీబీలు తీసుకొచ్చి చదును చేస్తున్నారు. దీనిపై ప్రశ్నించాం. పట్టించుకోకుండా అలాగే దున్నేశారు. పోలీసులు వచ్చి మమ్మల్ని పట్టుకుని బయటకు ఈడ్చారు. రూ.కోట్ల విలువైన వాటిని తక్కువకు ఎలా ఇస్తాం. సీఎం చంద్రబాబు ఉండే ప్రాంతంతలోనే ఇంత దారుణంగా పరిస్థితి ఉంది.

– సీతా మహాలక్ష్మి, రైతు

సీఆర్‌డీఏ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. అవార్డు ప్రకటించారని, సంతకాలు పెట్టాలని సీఆర్‌డీఏ డెప్యూటీ కలెక్టర్‌ కోరారు. ఎంత ప్రకటించారో చెప్పాలని కోరగా, సమాధానం చెప్పలేదు. మా అడ్వకేటు గట్టిగా మాట్లాడటంతో రూ. 73 లక్షలు ఎకరాకు అన్నారు. నిలదీస్తే సమాధానం ఇవ్వడం లేదు.

– సాంబశివరావు, రైతు

పెదకాకాని: పెదకాకానిలో తాళాలు వేసి ఇళ్లే టార్గెట్‌గా దుండగులు చోరీలకు తెగబడుతున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పెదకాకాని గ్రామానికి చెందిన రాధారపు నాగేశ్వరరావు ఆర్టీసీలో కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 7వ తేదీన ఫిరంగిపురం మండలం వేములూరుపాడులో పెద్ద కుమార్తె బంధువుల ఇంట్లో జరుగుతున్న వివాహ వేడుకలకు నాగేశ్వరావు భార్య, చిన్న కుమార్తె వెళ్లారు. అదే రోజు డ్యూటీ ముగించుకుని ఇంటికి రాకుండానే బస్టాండ్‌ నుంచి నాగేశ్వరరావు కూడా బంధువుల వివాహానికి వెళ్లాడు. వివాహ కార్యక్రమం ముగించుకొని శనివారం ఇంటికి వచ్చి చూసేసరికి ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటం, బీరువా పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు భావించి, పెదకాకాని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి పోలీసులు క్లూస్‌టీంతో చేరుకున్నారు. దొంగలు ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న 15 సవర్లు బంగారం, 40 తులాల వెండి, రూ.50 వేలు నగదు దోచుకెళ్లినట్లు బాధితులు తెలియజేశారు. బాధితుడు నాగేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పెద్దకాకాని సీఐ టీపీ నారాయణస్వామి తెలిపారు.

15 సవర్లు బంగారం అపహరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement