● పాటల తోటలో అలుపెరుగని కోయిల | - | Sakshi
Sakshi News home page

● పాటల తోటలో అలుపెరుగని కోయిల

Jul 12 2026 3:11 AM | Updated on Jul 12 2026 3:11 AM

● పాటల తోటలో అలుపెరుగని కోయిల

ప్రముఖ గాయని ఎస్‌.జానకి (88) వయోభారంతో మైసూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో శనివారం కన్నుమూయడంపై ఉమ్మడి గుంటూరు జిల్లాలోని సంగీత అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె మరణవార్త తెలిసి దిగ్భాంత్రికి గురయ్యారు. ఉమ్మడి గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా పల్లపట్ల గ్రామంలో ఎస్‌.జానకి జన్మించారు. దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడారు. ఎస్‌.జానకి ఆత్మకు శాంతి కలగాలని కళాదర్భార్‌ అమరావతి అధ్యక్షుడు పొత్తూరి రంగారావు తెలిపారు. మొదటిసారి 2009లో గుంటూరు ఆహ్వానించామన్నారు. ఆ రోజుల్లోనే ఎటువంటి అలసట లేకుండా నిలబడి 18 పాటలు ఆలపించారని ఆయన గుర్తుచేసుకున్నారు. మళ్లీ 2010–11లో గుంటూరు జిల్లా వందేళ్లు పూర్తయిన సందర్భంగా జానకితో పాటు పలువురు సీనియర్‌ గాయకులను శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో సత్కరించామన్నారు. ఎస్‌.జానకి మరణం బాధాకరమని ఈవీవీ కళా వాహిని అధ్యక్షుడు వెచ్చా కృష్ణమూర్తి తెలిపారు. – నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement