1525 టన్నుల ఎరువులు కొనుగోలు | - | Sakshi
Sakshi News home page

1525 టన్నుల ఎరువులు కొనుగోలు

Jul 12 2026 3:11 AM | Updated on Jul 12 2026 3:11 AM

1525 టన్నుల ఎరువులు కొనుగోలు రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలు ప్రారంభం

జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ

గుంటూరు వెస్ట్‌: ఏపీ–ఎయిమ్స్‌ యాప్‌ ద్వారా 1525 టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేశారని జిల్లా కలెక్టర్‌ సీఎం సాయికాంత్‌ వర్మ తెలిపారు. ఈ మేరకు శనివారం సాయంత్రం వ్యవసాయ అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జూన్‌ 8 నుంచి యాప్‌ వినియోగంలోకి వచ్చిందని, అప్పటి నుంచి ఇప్పటివరకు 1049 టన్నుల యూరియా, 476 టన్నుల డీఏపీ కలిపి 1525 టన్నుల ఎరువులను 5,443 మంది రైతులు ఏపీఏఐఎంఎస్‌ 2.0 యాప్‌ ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు. ఖరీఫ్‌ 2026కు జిల్లాలో ఇప్పటివరకు 41,583 మెట్రిక్‌ టన్నుల వివిధ రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. 15,630 మెట్రిక్‌ టన్నుల యూరియా, 3,579 మెట్రిక్‌ టన్నుల డీఏపీ ఉన్నాయన్నారు.

మంగళగిరి టౌన్‌: మంగళగిరి ఈద్గా షాదీఖానాలో గుంటూరు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 13వ ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ సీనియర్‌ ఎక్యూప్డ్‌ పవర్‌ లిఫ్టింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు శనివారం ప్రారంభమైనట్లు జిల్లా అసోసియేషన్‌ అధ్యక్షుడు విజయభాస్కరరావు, ప్రధాన కార్యదర్శి సంధాని తెలియజేశారు. వారు మాట్లాడుతూ ఈపోటీల్లో 250 మంది క్రీడాకారులు, క్రీడా ప్రతినిధులు హాజరయ్యారన్నారు. ఏపీ పవర్‌లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు జి.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ, పవర్‌ లిఫ్టింగ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ ప్రభాకరరావు, సౌత్‌జోన్‌ సెక్రటరీ కోటేశ్వరరావు, గుంటూరు జిల్లా ఒలింపిక్‌ అసోసియేషన్‌ మెంబర్‌ ఉదయకిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement