వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ అందె | - | Sakshi
Sakshi News home page

వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ అందె

Jul 6 2026 1:28 AM | Updated on Jul 6 2026 1:28 AM

గుంటూరు మెడికల్‌: పద్మశాలి వైద్యుల నూతన కార్యవర్గం ఎన్నిక విజయవాడ లోని పద్మశాలి కళ్యాణమండపం లో ఆదివారం జరిగింది.ఆంధ్రప్రదేశ్‌ పద్మశాలి వైద్యుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎన్నికలు జరిగాయి.ఈ ఎన్నికల్లో గుంటూరు నగరానికి చెందిన ప్రముఖ పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ అందె వెంకటేశ్వరరావు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షుడిగా విజయవాడకు చెందిన డాక్టర్‌ సింగరి ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శిగా ప్రొద్దుటూరుకు చెందిన డాక్టర్‌ టి.మునిరామ ప్రసాద్‌, కోశాధికారిగా నగరానికి చెందిన డాక్టర్‌ కొల్లి జయకిషన్‌లు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని పలువురు అభినందించారు.

ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనం దగ్ధం

మధురానగర్‌(విజయవాడసెంట్రల్‌): దావు బుచ్చయ్యకాలనీలో ఆదివారం ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనం దగ్ధమైంది. ఆ వాహనం పక్కనే ఉన్న కారు సైతం పాక్షికంగా దెబ్బతింది. ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనం నుంచి మంటలు వస్తుండటంతో ఏం ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన చెందారు. స్థానికుల కథనం మేరకు.. ఆదివారం ఉదయం ఒక్కసారిగా ఎలక్ట్రిక్‌ వాహనం నుంచి మంటలు ఎగశాయి. చుట్టపక్కల వారు ద్విచక్రవాహనం యజమానికి సమాచారం ఇచ్చారు. ఆయన స్పందించి మంటలు అదుపు చేసేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఎలక్ట్రిక్‌ ద్విచక్రవాహనం దగ్ధమైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement