బాధితులకు ఉచితంగా వ్యాక్సిన్‌ | - | Sakshi
Sakshi News home page

బాధితులకు ఉచితంగా వ్యాక్సిన్‌

Jul 6 2026 1:28 AM | Updated on Jul 6 2026 1:28 AM

గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో ప్రతి రోజూ సుమారు 50 మంది కుక్కకాటు బాధితులు వ్యాక్సిన్‌ చేయించుకుంటున్నారు. అవుట్‌ పేషేంట్‌ విభాగంలోని 14వ నెంబర్‌ గదిలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు ఉచితంగా ర్యాబీపూర్‌ వ్యాక్సిన్‌ చేస్తున్నారు. అత్యవసర విభాగంలో అన్నివేళలా ఈ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉంటుంది. కుక్కకాటును ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రదించి వ్యాక్సిన్‌ వేయించుకోవాలి. ముఖ్యంగా పిల్లలను కుక్కలకు దూరంగా ఉంచడం ద్వారా కుక్కకాటు బారిన పడకుండా కాపాడవచ్చు.

– డాక్టర్‌ గిరిజవోలు దుర్గాప్రసాద్‌,

సూపరింటెండెంట్‌, గుంటూరు జీజీహెచ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement