రాతియుగంవైపు రాష్ట్రం
గత ప్రభుత్వంలో పల్నాడులో శాంతిభద్రతలు నెలకొనేలా కృషిచేశాం. గ్రామాల నుంచి వెళ్లి బయట నివసిస్తున్న వారిని పోలీసుల సాయంతో వెనక్కి రప్పించి కుటుంబంతో ప్రశాంతంగా బతికే వాతావరణం తీసుకొచ్చాం. కానీ సీఎం చంద్రబాబు మాత్రం విజనరీనని చెప్పుకుంటూనే రాష్ట్రాన్ని మళ్లీ రాతి యుగంవైపుకి నడిపిస్తున్నాడు. రెడ్‌బుక్ పాలనతో కక్ష రాజకీయాలకు తెరలేపాడు. గ్రామానికి ఎందుకొచ్చావ్ అని ప్రశ్నిస్తున్న పోలీసులు పనిచేయడం చేతకాని అసమర్థుల కిందే లెక్క. అలాంటి వారు ఉద్యోగాలకు పనికిరారు. తక్షణమే రాజీనామా చేయాలి. బాధితులకు భరోసా ఇవ్వలేకపోవడం ప్రభుత్వ అసమర్థతే అవుతుంది.
– మేకతోటి సుచరిత, మాజీ హోంమంత్రి


