నీట్ ఎస్‌ఎస్‌లో డాక్టర్ సాయిపూజకు ఆల్ ఇండియా 39వ ర్య
గుంటూరు ఎడ్యుకేషన్: ఇటీవల ప్రకటించిన నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్షా ఫలితాల్లో గుంటూరు మెడికల్ కళాశాలకు చెందిన డాక్టర్ కొండబోలు సాయి పూజ ఆల్ ఇండియా 39వ ర్యాంక్ కై వసం చేసుకున్నారు. గుంటూరు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ అభ్యసించిన సాయిపూజ అదే కళాశాలలో జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ పూర్తి చేశారు. చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమెకు బెస్ట్ అవుట్ గోయింగ్ స్టూడెంట్ అవార్డుతో పాటు అనేక విభాగాల్లో గోల్డ్ మెడల్స్ లభించాయి. ఆమె తండ్రి డాక్టర్ కొండబోలు సాంబశివరావు జేకేసీ కళాశాలలో వైస్ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తిస్తుండగా, తల్లి ఉషా గృహిణి. ఆమె చదువు కొనసాగించడంలో భర్త డాక్టర్ నరేంద్రతో పాటు, అత్తమామలు డాక్టర్ పులుకూరి శివన్నారాయణ. డాక్టర్ లక్ష్మీ ప్రోత్సాహాన్ని అందించారు. అధ్యాపకుల ప్రోత్సాహం, మార్గదర్శకత్వం తాను అఖిల భారతస్థాయిలో 39వ ర్యాంకు సాధించడంలో కీలక పాత్ర పోషించాయని పేర్కొన్నారు. డాక్టర్ సాయిపూజతోపాటు ఆమె భర్త డాక్టర్ నరేంద్ర, అత్త డాక్టర్ లక్ష్మీ ముగ్గురూ గుంటూరు మెడికల్ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు కావడం విశేషం.
రూ.18.43 లక్షల విలువైన సిగరెట్లు సీజ్
తెనాలిరూరల్: తెనాలిలో అక్రమంగా నిల్వ చేసిన సిగరెట్లను విజిలెన్స్, జీఎస్టీ అధికారులు గుర్తించి సీజ్ చేశారు. సుమారు రూ.18, 43,200 విలువైన ఎటువంటి బిల్లులు లేని సిగరెట్లను అధికారులు గుర్తించారు. పట్టణంలో ఆదివారం జీఎస్టీ, విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా వివిధ గోడౌన్లపై దాడులు చేశారు. మార్కెట్ ప్రాంతంలోని అంజయ్య వీధిలో కౌతరపు నమ్మయ్య నిర్వహిస్తున్న గోడౌన్‌లో రూ. 6.40 లక్షల విలువైన బిల్లులు లేని సిగరెట్లు, అలానే నందులపేట దేవినేని వారి వీధిలో వేములపల్లి మురళీకృష్ణ, ఉయ్యూరు సుబ్బారావుగుప్తాలకు చెందిన రూ. 12,03,200 విలువ గల సిగరెట్లను గుర్తించి సీజ్ చేశారు. గోడౌన్‌ల నిర్వాహకులపై కేసులు నమోదు చేసి వన్ టౌన్, టూ టౌన్ పోలీసులకు అప్పగించారు.
ఐదు లారీలు సీజ్
తాడేపల్లి రూరల్ : మంగళగిరి పట్టణ పరిధిలోని పలుప్రాంతాల్లో ఎటువంటి బిల్లులు, అనుమతులు లేకుండా మట్టి, కంకర, ఇసుక తరలిస్తున్న ఐదు లారీలను మంగళగిరి పట్టణ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున సీజ్ చేశారు. రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాల నుంచి మట్టితో పాటు ఇసుక, కంకర అక్రమంగా తరలించడంతో గస్తీ నిర్వహించిన పోలీసులు వాటిని గుర్తించి సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇదిలా ఉండగా మరో రెండు లారీలను వదిలివేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకుల ఒత్తిళ్ల వల్లే ఆ రెండు లారీలు వదిలిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం.
లీజు వ్యవహారంలో వివాదం
దుగ్గిరాల: లీజు వివాదం నేపథ్యంలో అర్ధరాత్రి డెయిరీ కూల్చివేశారని ఫిర్యాదు అందింది. లీజుదారుడు అంచా నరేంద్ర కుమార్ ఆదివారం దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరు గ్రామంలో తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి డెయిరీ ఫామ్‌లో గుర్తుతెలియని వ్యక్తులు 50 మందికి పైగా వచ్చి జేసీబీలతో ధ్వంసం చేసి, 200 కోళ్లను పట్టుకుపోయారని చెప్పారు. 40 గేదెలు, 20 పడ్డలను బయటకు తోలారని తెలిపారు. పని చేస్తున్న వారి సెల్‌ఫోన్లు లాక్కున్నారని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని పంపించి వేశారని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఐటీ శాఖకు సొత్తు
అప్పగించాలని నిర్ణయం
తెనాలి రూరల్: తెనాలి బాలాజీరావుపేట మహేంద్ర కాలనీలో రేకుల ఇంట్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. కాలనీలో పేరుబోయిన గురవమ్మ ఇంటి నుండి 700 గ్రాముల బంగారం, 15 కిలోల వెండి, రూ.5.60 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాటిలో కొన్నింటికి సంబంధించి ఆమె అల్లుడు గురునాథం త్రీ టౌన్ పోలీసులకు బిల్లులు సమర్పించారు. సుమారు రూ.1.50 కోట్ల విలువైన సొత్తు కావడంతో ఆదాయపన్ను శాఖకు అప్పగించాలని పోలీసులు నిర్ణయించారు. ఒకట్రెండు రోజులలో అప్పగించే అవకాశం ఉంది.
నీట్ ఎస్‌ఎస్‌లో డాక్టర్ సాయిపూజకు ఆల్ ఇండియా 39వ ర్య
నీట్ ఎస్‌ఎస్‌లో డాక్టర్ సాయిపూజకు ఆల్ ఇండియా 39వ ర్య
నీట్ ఎస్‌ఎస్‌లో డాక్టర్ సాయిపూజకు ఆల్ ఇండియా 39వ ర్య


