బాధితులకు న్యాయం జరిగేవరకు ఉద్యమం
చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాడులు, వేధింపులు మరీ ఎక్కువగా ఉంటున్నాయి. అయినా అవన్నీ లెక్కచేయకుండా పార్టీ కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెబుతున్నా. ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే మందా సాల్మన్ హత్య జరిగింది. ఇది కచ్చితంగా ప్రభుత్వ హత్యే. వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచిన వ్యక్తుల మీద దాడులు పరిపాటిగా మారాయి. సామాన్యుడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. బాధితులనే నిందితులుగా మార్చి చూపిస్తున్నారు. పిన్నెల్లి గ్రామం నుంచి 300 కుటుంబాలు బయటకు వెళ్లి జీవించాల్సిన దుస్థితి వచ్చిందంటే ఇది పోలీసుల చేతకానితనమే. మందా సాల్మన్ కుటుంబానికి న్యాయం చేసే వరకు వైఎస్సార్‌సీపీ పోరాడుతుంది.
– విడదల రజని, మాజీ మంత్రి
వైఎస్సార్‌సీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్‌ని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి. దళితులను చంపుకుంటూ పోతున్నారు. ఇటువంటి విష సంస్కృతి టీడీపీ నేతలకు తగదు.
– చంద్రగిరి ఏసురత్నం, ఎమ్మెల్సీ
చంద్రబాబు దృష్టిలో దళితుల ఓట్లకున్న విలువ వారి ప్రాణాలకు లేదు. చంద్రబాబు సర్కార్ వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులు, బహిష్కరణలు, వేధింపులే దీనికి నిదర్శనం. సాల్మన్‌ను దారుణంగా హత్య చేసి పది రోజులవుతున్నా ఇంతవరకు ఏమాత్రం స్పందించని చంద్రబాబు... వైఎస్సార్‌సీపీ సంస్మరణ కార్యక్రమం నిర్వహిస్తుందని తెలుసుకుని గ్రామంలోకి టీడీపీ నాయకులను పంపించి కుటిల రాజకీయాలు చేస్తున్నారు. సాల్మన్‌ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. దళితుల గ్రామ బహిష్కరణ జరిగి రెండేళ్లవుతుంటే ఒక్కసారి కూడా పట్టించుకోని చంద్రబాబు కారణంగానే ఈ హత్య జరిగింది. సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి. గ్రామంలో శాంతియుత వాతావరణం తీసుకురావాలి. గ్రామం నుంచి వెళ్లిపోయిన కుటుంబాలను రప్పించాలి. సాల్మన్ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది.
– గోపిరెడ్డి, వైఎస్సార్‌సీసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే
సాల్మన్ హత్యను ఈ సమాజం తీవ్రంగా ఖండిస్తోంది. దళితుల మీద దాడులను టీడీపీ నాయకులు ఆపకపోతే రాబోయే రోజుల్లో కచ్చితంగా ప్రతిఫలం అనుభవిస్తారు.
– నారాయణమూర్తి, పార్టీ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడు
●
బాధితులకు న్యాయం జరిగేవరకు ఉద్యమం
బాధితులకు న్యాయం జరిగేవరకు ఉద్యమం
బాధితులకు న్యాయం జరిగేవరకు ఉద్యమం


