వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు | - | Sakshi
Sakshi News home page

వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు

Jan 26 2026 4:56 AM | Updated on Jan 26 2026 4:56 AM

వాహనద

వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు

వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం

తాడికొండ: తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రాయపూడిలో సోమవారం నిర్వహించనున్న రాష్ట్రస్థాయి గణతంత్ర దినోత్సవానికి హాజరయ్యే వీవీఐపీలు, వీఐపీలు, ఇతర ప్రముఖులు, ప్రజల వాహనాల రాకపోకల కోసం ఈ క్రింది ట్రాఫిక్‌ మార్గాలను కేటాయించామని తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు.

రూట్‌ నెంబర్‌ 1 :

వీవీఐపీ, ఏఏ, ఏ1, ఏ2 పాస్‌లు మరియు రైతులు లోటస్‌ – కరకట్ట మీదుగా – ఎమ్మెస్సార్‌ ఆశ్రమం – సీడ్‌ యాక్సెస్‌ రోడ్‌ – ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ఎడమవైపు నుంచి వేడుకల మైదానానికి చేరుకోవాలి.

రూట్‌ నెంబర్‌ 2:

బీ1, బీ2 పాస్‌ హోల్డర్స్‌ మరియు రైతులు ఎమ్మెల్యే క్వార్టర్స్‌ ముందుకు వెళ్లి వెస్ట్‌ బైపాస్‌ రోడ్డు నుంచి వేడుకల మైదానంలోకి చేరుకోవాలి.

● గుంటూరు నుంచి వచ్చే సాధారణ వాహనాలు మురుగన్‌ హోటల్‌ సెంటర్‌ నుంచి వెస్ట్‌ బైపాస్‌ మీదుగా వెళ్లి ఈ–8 రోడ్డు అండర్‌ పాస్‌ – మందడం గ్రామం – వెలగపూడి – మోదుగు లింగాయపాలెం – ఈ–4 – పాతవెలగపూడి రోడ్డు జంక్షన్‌ నుంచి ఈ–4 రోడ్‌ పార్కింగ్‌ ప్రదేశానికి వెళ్లాలి.

● విజయవాడ వైపు నుంచి వచ్చు సాధారణ వాహనాలు విజయవాడ – ప్రకాశం బ్యారేజ్‌ – ఉండవల్లి – ఉండవల్లి గుహలు – పెనుమాక – కృష్ణాయపాలెం – మందడం – వెలగపూడి – ఈ4 రోడ్డు జంక్షన్‌ – మోదుగ లింగాయపాలెం – ఈ4 రోడ్‌ పార్కింగ్‌కు వెళ్లాలి.

● గొల్లపూడి నుంచి వచ్చు సాధారణ వాహనాలు విజయవాడ – వెంకట పాలెం – ఈ–8 అండర్‌ పాస్‌ – మందడం – వెలగపూడి – ఈ–4 జంక్షన్‌ – మోదుగ లింగాయ పాలెం – ఈ–4 రోడ్‌ పార్కింగ్‌ ప్రదేశానికి వెళ్లాలి.

● తుళ్లూరు నుంచి వచ్చే సాధారణ వాహనాలు తుళ్లూరు – ఈ–6 వెస్ట్‌ పార్క్‌ రోడ్‌ – హైకోర్టు ఈ–4 జంక్షన్‌ నుంచి ఈ–4 పార్కింగ్‌ ప్రదేశానికి వెళ్లాలి.

● హైకోర్టు లాయర్ల వాహనాలు ప్రకాశం బ్యారేజ్‌ – ఉండవల్లి – ఉండవల్లి కేవ్స్‌ – పెనుమాక – కృష్ణాయపాలెం – మందడం – వెలగపూడి – ఈ–4 రోడ్డు పా ర్కింగ్‌ ప్రదేశానికి వెళ్లాలి. సభకు వచ్చేవారు అందరూ పోలీస్‌ వారి సూచనలు గమనించి సహకరించాలని తుళ్లూరు ట్రాఫిక్‌ పోలీసులు ప్రకటనలో తెలిపారు.

పొన్నూరు: స్థానిక శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం కళాశాల ప్రాంగణంలో నిర్వహించారు. దివంగతులైన తమ గురువులు, ఇతర సిబ్బందిని, మిత్రులను గుర్తు చేసుకుని ముందుగా శ్రద్ధాంజలి ఘటించారు. కళాశాల స్థాపించిన నాటి నుంచి అక్కడే విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఒకచోట చేరి పలుకరించుకున్నారు. కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థి, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి పాల్గొన్నారు. తొలుత శ్రీ సాక్షి భావనారాయణ స్వామి ఆలయంలో స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో లక్ష్మీపార్వతి మాట్లాడుతూ రాష్ట్రంలోనే శ్రీ భావనారాయణ స్వామి సంస్కృత కళాశాలకు విశేష స్థానముందన్నారు. ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పారు. కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు డాక్టర్‌ వేదాల వెంకట సీతారామాచార్యులు మాట్లాడుతూ తెలుగు బాషాభివృద్ధికి ఈ కళాశాలలో చదివిన వారు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులుగా విశేషమైన సేవలందించినట్లు అన్నారు. అనంతరం పూర్వ విద్యార్థులు రాసిన గ్రంథాలు, పుస్తకాలను ఆవిష్కరించారు. అధ్యాపకులను సన్మానించారు. కార్యక్రమంలో సూరా రామారావు, నారాయణం మురళీధర, పరాశరం శేషుకుమారి, మన్నవ అనసూయదేవి, మాజేటి జగన్నాథరావు, గోవర్ధనం రామకృష్ణ, పెద్ద సంఖ్యలో పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

స్నేహ పరిమళం.. రజతోత్సవ వేడుకలు

30 ఏళ్ల తరువాత కలుసుకున్న స్నేహితులు

గుంటూరు మెడికల్‌: సుమారు 30 ఏళ్ల విరామం అనంతరం తమ కుటుంబ సభ్యులతో స్నేహితులతో సంతోషంగా గడిపారు. ఈ మధుర కలయిక స్నేహ పరిమళానికి అమరావతి రోడ్డులోని హిందూ కాలేజీ ఫార్మసీ కళాశాల వేదికై ంది. 140 మంది సభ్యులు హాజరయ్యారు. బ్యాచిలర్స్‌గా జీవనాన్ని ప్రారంభించి స్నేహితుడిగా మారి ఇప్పుడు తాతలుగా కలుసుకున్న సరదా అనుభవాలు పంచుకున్నారు. డాక్టర్‌ కాకాని పథ్వీరాజ్‌ కన్వీనర్‌గా, డాక్టర్‌ ఎస్‌వీ రమణ కో–కన్వీనర్‌గా, ఆర్గనైజింగ్‌ టీంలో ఉన్న లక్ష్మీపతి, సింగం లక్ష్మీ నారాయణ, వేదాంతం వినోద్‌ కిషన్‌ ,జీవీ సూర్యనారాయణ, కొండా రవిశంకర్‌, పింగళి రాజేశ్వరరావు, బుచ్చిబాబు, సలీమ్‌, రమేష్‌ తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించారు. ప్రతి ఒక్కరికి పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌, ఒక కిట్‌ బహుమతిగా ఇచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. 75 సంవత్సరాలు నిండిన వారికి సన్మానం చేశారు. సన్మాన గ్రహీతలలో డాక్టర్‌ కాకాని పథ్వీరాజు డాక్టర్‌ ఎస్వీ రమణ, డాక్టర్‌ పీవీ రావు, డాక్టర్‌ ఎస్వీరావు తదితరులు ఉన్నారు. ఒకే కంపెనీలో 25 సంవత్సరాలు పనిచేసిన 25 మంది సభ్యులకు జ్ఞాపికలు అందజేసి సన్మానం చేశారు.

వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు 1
1/1

వాహనదారులకు ట్రాఫిక్‌ పోలీసుల సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement