బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలి
రెండేళ్లుగా 400 కుటుంబాలు ఒక గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయంటే శాంతిభద్రతలు పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పడానికి వేరే ఉదాహరణలు అవసరం లేదు. సాల్మన్ హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం. అందుకు కారణమైన పోలీస్ అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలి. ఈ దారుణ హత్యపై ప్రభుత్వ పెద్దలు స్పందించకపోగా... కేసును నీరుగార్చాలనే కుట్ర చేస్తున్నారు. సాల్మన్ కుటుంబానికి ప్రభుత్వం రూ.కోటి పరిహారం, ఐదెకరాల పొలం ఇచ్చి ఆదుకోవాలి.
– కొమ్మూరి కనకారావు, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటయ్యాక వెనుబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల మీద దాడులు నిత్యకృత్యం అయ్యాయి. ఏడాది పాలన పూర్తి కాకుండానే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 20 నెలల్లో చంద్రబాబు పాలన మీద ప్రజా వ్యతిరేకత పతాకస్థాయికి చేరింది. పిన్నెల్లి మాదిరిగానే బొల్లాపల్లి నియోజకవర్గం పలుకూరులో కూడా టీడీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 400 కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి. గ్రామంలో భూములన్నీ బీడు బారిపోయాయి. ఇలాంటి దుస్థితిని సృష్టించిన ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు. కార్యకర్తలకు, ప్రజలకు పార్టీ అండగా ఉంటుంది.
– బొల్లా బ్రహ్మనాయుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే
సాల్మన్‌ను ప్రత్యర్థులు దారుణంగా ఇనుప రాడ్లతో కొట్టి దాడి చేస్తే, అపస్మారక స్థితిలో ప్రాణాపాయంతో ఆస్పత్రిలో ఉన్న బాధితుడిపైనే పోలీసులు కేసు నమోదు చేశారు. అంటే రెడ్‌బుక్ రాజ్యాంగం అమల్లో పోలీసులు ఎంత అప్రమత్తంగా పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు, నిందితులకు అండగా ఉండి బాధితులపైనే కేసులు పెడుతున్నారు. గ్రామం నుంచి వెళ్లిపోయిన 300 కుటుంబాలను వెనక్కి రప్పించే ప్రయత్నం చేయకపోవడం దుర్మార్గం. బయటకెళ్లిన వారు ఎవరైనా మరణిస్తే పోలీసుల రక్షణ లేకుండా గ్రామస్తుడి అంత్యక్రియలు చేసుకోలేని దుస్థితి. పోలీసుల రక్షణలో అంత్యక్రియలు నిర్వహించాలంటే రూ.లక్షలు ఖర్చవుతుందని భయపెడుతున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వం మారిన నాటి నుంచి పల్నాడులో ఫ్యాక్షన్ వాతావరణం తీసుకొచ్చారు.
– గజ్జల సుధీర్ భార్గవరెడ్డి, సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త
●
బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలి
బాధ్యులైన పోలీసులను సస్పెండ్ చేయాలి


