మూర్ఛ వ్యాధికి ఆధునిక చికిత్స
● డాక్టర్ విజయ మాట్లాడుతూ మెదడులో ఉన్న నాడీ కణాలు ఒకదానితో ఒకటి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా సందేశాలు పంపుతాయని చెప్పారు. ఈ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అకస్మాత్తుగా, అసాధారణంగా ఎక్కువ కావడం, నియంత్రణ లేకుండా పెరగడంతో మూర్ఛ వ్యాధి వస్తుందన్నారు.
● సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజిస్టు డాక్టర్ ఉప్పాల వీరమ్మ మాట్లాడుతూ పుట్టక సమయంలో మెదడుకు గాయాలు కావడం, మెదడు ఇన్‌ఫెక్షన్లు, మెదడు అభివృద్ధి లోపాలు, తల గాయాలు, పక్షవాతం, బ్రెయిన్ ట్యూమర్లు, వారసత్వం కారణాల వల్ల మూర్ఛ వ్యాధి వస్తుందని చెప్పారు.
● డాక్టర్ ఉషాకిరణ్ మాట్లాడుతూ మూర్ఛ వచ్చి పడిపోయినప్పుడు ప్రజలు చుట్టూ గుమికూడకుండా చూడాలన్నారు. మూర్ఛతో పడిపోయిన వారిని పక్కకు తిప్పి పడుకోబెట్టాలన్నారు. వెంటనే వైద్యుడి సహాయం పొందాలన్నారు.
● డాక్టర్ అజ్మ మాట్లాడుతూ మూర్ఛ వ్యాధి బాధితులు క్రమం తప్పకుండా మందులు వాడాలని చెప్పారు.
● న్యూరో సైక్రియాటిస్ట్ డాక్టర్ అజయ్ మాట్లాడుతూ వ్యాధి వల్ల అనేక సామాజిక సమస్యలు ఎదువుతాయని, వాటిని ఏవిధంగా ఎదుర్కోవాలో వివరించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మూర్ఛ వ్యాధి బాధితులు, వారి సహాయకులు, నర్సింగ్ సిబ్బంది, ఫార్మా సిబ్బంది పాల్గొన్నారు.
●ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ పమిడిముక్కల విజయ
గుంటూరు మెడికల్: మూర్ఛ వ్యాధికి అత్యాధునిక వైద్య చికిత్సలు నేడు అందుబాటులో ఉన్నాయని, ఈ వ్యాధిపై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఇండియన్ స్ట్రోక్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు, లలితా సూపర్ స్పెషాలిటీ న్యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ పమిడిముక్కల విజయ అన్నారు. నేషనల్ ఎప్లిక్సిడే సందర్భంగా బుధవారం గుంటూరు కొత్తపేటలోని లలితా సూపర్‌స్పెషాలిటీ హాస్పటల్ ప్రాంగణంలో డాక్టర్ విజయ ఆధ్వర్యంలో మూర్ఛ వ్యాధిపై అవగాహన సదస్సు నిర్వహించారు.