23న గుంటూరు జిల్లా స్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు
గుంటూరు ఎడ్యుకేషన్: జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈనెల 23న తెనాలిలోని వివేకా హైస్కూల్లో గుంటూరు జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నట్లు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. బుధవారం గుంటూరులో సైన్స్ సంబరాల పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో నిర్వహించిన సైన్స్ క్విజ్ పోటీలకు జిల్లా వ్యాప్తంగా 15వేల మంది విద్యార్థులు పాల్గొన్నారని చెప్పారు. మండల స్థాయిలో జరిగిన పోటీల్లో విజేతలుగా నిలిచిన 60 టీమ్‌లు జిల్లా స్థాయికి ఎంపికయ్యారని వివరించారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జేవీవీ ప్రతినిధులు జి. వెంకటరావు, టి.జాన్‌బాబు, బి. ప్రసాద్, టీఆర్ రమేష్, టీఆర్ చాందిని, ఎస్‌ఎం సుభానీ, గురవయ్య, వీవీకే సురేష్, డి.రమేష్‌బాబు పాల్గొన్నారు.


