
వైఎస్సార్ సీపీలో పదవుల నియామకం
పట్నంబజారు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలోని పలువురిని పలు పదవుల్లో నియమిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. ఈ మేరకు గురువారం కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. తాడికొండ నియోజకవర్గానికి చెందిన సయ్యద్ హబీబుల్లాను పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా, పార్టీ వలంటీర్స్ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా షేక్ నాసర్‌వలీ, కల్చరల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తమనంపల్లి శాంతయ్య, గుంటూరు తూర్పు నియోజకవర్గానికి సంబంధించి మైనారిటీ విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శిగా షేక్ అఫ్సర్, క్రిస్టియన్ మైనారిటీ విభాగం కార్యదర్శిగా మద్దు ప్రేమజ్యోతిబాబు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి చెందిన డాక్టర్ పి.ముత్యంను క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.