మెరిట్‌ లేని డీఎస్సీ! | - | Sakshi
Sakshi News home page

మెరిట్‌ లేని డీఎస్సీ!

Aug 29 2025 2:44 AM | Updated on Aug 29 2025 2:44 AM

మెరిట్‌ లేని డీఎస్సీ!

మెరిట్‌ లేని డీఎస్సీ!

మెరిట్‌ లేని డీఎస్సీ!

మెరిట్‌ కం రోస్టర్‌ జాబితా ప్రకటించకుండానే కాల్‌ లెటర్లు అర్హులైన జాబితా ప్రకటించే విధానానికి మంగళం పలికిన విద్యాశాఖ గుంటూరులో ప్రారంభమైన డీఎస్సీ–2025 సర్టిఫికెట్ల పరిశీలన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించిన 19 బృందాలు ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు ఎంపికై తే దరఖాస్తులో ఇచ్చిన ఆప్షనే అంతిమం పోస్టుల ఎంపికకు ఇప్పుడు అవకాశం లేక ఆందోళన చెందుతున్న అభ్యర్థులు ప్రభుత్వ నిర్ణయం మేరకే పోస్టింగ్‌ అంటున్న జిల్లా స్థాయి అధికారులు

కాల్‌ లెటర్‌ వస్తేనే ఉద్యోగమంటూ కూటమి సర్కార్‌ మెలిక

జాబితా ప్రకటనేదీ?

డీఎస్సీ –2025లో ప్రతిభ చాటిన అభ్యర్థులు కూటమి సర్కార్‌ తీరుతో ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ కొలువుల కోసం ఏళ్ల తరబడి శ్రమించి, పరీక్షలు రాసిన వారు పోస్టింగు ఆర్డర్లు అందుకోవడం గగనంగా మారింది. కష్టపడి చదివి, పరీక్షలు రాసి మెరిట్‌లో ఉన్నప్పటికీ విద్యాశాఖ నుంచి కాల్‌ లెటర్‌ పంపితేనే ఉద్యోగం అంటూ ప్రభుత్వం తెచ్చిన కొత్త నిబంధనలతో అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: డీఎస్సీ–2025 నోటిఫికేషన్‌ ఆధారంగా పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌, సబ్జెక్టుల వారీగా స్కూల్‌ అసిస్టెంట్లు, ఫిజికల్‌ డైరెక్టర్‌ తదితర పోస్టులకు పలువురు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షల్లో మంచి మార్కులను సాధించి, పోస్టు ఖాయం అనుకున్న అభ్యర్థులు సైతం విద్యాశాఖ విధించిన నిబంధనలతో అయోమయంలో పడ్డారు. పోస్టింగ్‌ వస్తుందా, లేదా అనే సందేహాలతో సతమతం అవుతున్నారు. కాల్‌ లెటర్‌ వస్తేనే ఉద్యోగం, లేకుంటే కొలువు గల్లంతే అనే విధంగా కూటమి ప్రభుత్వం తీరు ఉంది.

19 బృందాలతో పరిశీలన

ఉమ్మడి గుంటూరు జిల్లాలో డీఎస్సీ–2025 ద్వారా ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను గురువారం గుంటూరు నగరంలోని ఆంధ్ర క్రైస్తవ (ఏసీ) కళాశాలలో చేపట్టారు. మొత్తం 1,143 పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో చూపించారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 19 టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంకు కళాశాలలోని ఆడిటోరియంతోపాటు వేర్వేరు గదుల్లో 50 మంది చొప్పున అభ్యర్థులను కేటాయించారు. పాఠశాల విద్యాశాఖ నుంచి కాల్‌ లెటర్‌ అందుకున్న అభ్యర్థుల వారీగా డీఎస్సీ సైట్‌లో సర్టిఫికెట్లను విజయవంతంగా అప్‌లోడ్‌ చేసుకున్న వారినే వెరిఫికేషన్‌కు పిలిచారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల డీఈవోలు సీవీ రేణుక, చంద్రకళ, పురుషోత్తం పర్యవేక్షణలో టీమ్‌ల వారీగా నియమించిన అధికారులు సర్టిఫికెట్ల పరిశీలన జరిపారు. పరిశీలకురాలిగా కమిషనరేట్‌ నుంచి పి.శైలజ హాజరు కాగా, డీఆర్వో ఖాజావలి వెరిఫికేషన్‌ సెంటర్‌ను తనిఖీ చేశారు.

పాఠశాల విద్యాశాఖ నుంచి కాల్‌ లెటర్‌ పొందిన అభ్యర్థులకే పోస్టింగ్‌ అని, లేదంటే పోస్టింగ్‌ రాదనే కోణంలో ఉపాధ్యాయ నియామక ప్రక్రియ మారిపోయింది. పోస్టులకు మెరిట్‌ కం రోస్టర్‌ ప్రకారం జాబితాను బహిరంగంగా ప్రదర్శించినట్లయితే అభ్యర్థులు ఎవరికి వారు తమకు వచ్చిన మార్కులు, రిజర్వేషన్‌ కేటగిరీ, మెరిట్‌లో తమ కంటే ఎంత మంది ముందు ఉన్నారనే సాధారణమైన సమాచారాన్ని తెలుసుకునే అవకాశం ఉండేది. కాల్‌ లెటర్లు అందుకున్న అభ్యర్థులు సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు అయ్యారు. మరికొంత మంది కాల్‌ లెటర్లు రాకపోవడానికి కారణాలు తెలుసుకునేందుకు వచ్చారు. ప్రతి పోస్టుకు మెరిట్‌ ప్రకారం ఇద్దరేసి అభ్యర్థులను ఎంపిక చేసిన అధికారులు... వెరిఫికేషన్‌ సెంటర్‌కు వచ్చిన వారి సర్టిఫికెట్లను పరిశీలన జరిపారు. 19 టీమ్‌ల వారీగా 930 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన గురువారం రాత్రికి పూర్తి చేసేందుకు నిర్ణయించారు. మిగిలిన వారి సర్టిఫికెట్లను శుక్రవారం పరిశీలన చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement