
‘పీఎంవీబీఆర్‌వై’పై అవగాహన సదస్సు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్) : గుంటూరు రైల్వే డివిజన్ కార్యాలయంలో వివిధ సంస్థల ఉద్యోగులు, యజమానుల ప్రయోజనం కోసం ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) కొత్తగా ప్రధాన మంత్రి విక్షిత్ భారత్ రోజ్‌గార్ యోజన(పీఎంవీబీఆర్‌వై)ను ప్రారంభించినట్లు డీఆర్‌ఎం సుథేష్ట సేన్ తెలిపారు. గుంటూరు పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో గుంటూరు అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ పి. గోపాల్‌సింగారు ఆధ్వర్యంలో పీఎంవీబీఆర్‌వైపై మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యాక్రమంలో ఆమె మాట్లాడారు. పథకం ముఖ్య అంశాలు, ప్రయోజనాలను, ఈపీఎఫ్‌ఓలో కాంట్రాక్ట్ సంస్థల ఉద్యోగుల నమోదు సంస్థల ద్వారా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యూఏఎన్) జనరేషన్ గురించి వివరించారు. కొత్త ఉద్యోగుల నియామకం, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, యజమానులను ప్రోత్సహించడం లక్ష్యంగా పీఎంవీబీఆర్‌వై పెట్టుకుందని వివరించారు. ఈ పథకం కింద, భారత ప్రభుత్వం కొత్త ఉద్యోగులకు, యజమానులకు ప్రయోజనాలను నిర్దిష్ట కాలానికి చెల్లిస్తుందని తెలిపారు. తద్వారా యజమానులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తుందని తెలిపారు. ఈ పథకం ఈనెల 1వ తేదీ నుంచి 2027 జూలై 31 వరకు అమలులో ఉంటుందని ఆమె చెప్పారు. కార్యక్రమంలో రైల్వే డివిజన్ ఉద్యోగులు, పీఎఫ్ సిబ్బంది కె.నాగరాజు పాల్గొన్నారు.

‘పీఎంవీబీఆర్‌వై’పై అవగాహన సదస్సు

‘పీఎంవీబీఆర్‌వై’పై అవగాహన సదస్సు