
సాక్షి, తాడేపల్లి: నేడు వినాయకచవితి. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.
వినాయకచవితి సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్..‘రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలి. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలి. సకల శుభాలు కలగాలి. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలి. ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలి. గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలి’ అని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు.
అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.#VinayakaChaturthi2025
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 27, 2025