breaking news
Vinayakachavithi
-
శివుడు..‘శిరస్సు ఖండించటం వెనుక ఉన్న అద్భుత జ్ఞానం’
పురాణ గాథ ప్రకారం ఒకనాడు పరమశివుడు కైలాసానికి వచ్చినపుడు అతనిని లోనికి వెళ్లనివ్వకుండా ఒక బాలుడు అడ్డగించిన పురాణగాధ మనం విని ఉన్నాం. పార్వతి తన శరీరపు మలినంతో సృష్టించి, ద్వారపాలకునిగా నిలిపిన ఆ బాలుడిపై కోపించిన శివుడు అతడి తలను ఖండించాడు. తన కుమారుని నిర్జీవంగా చూసిన పార్వతి కలత చెంది శివుడిని వేడుకుంది. ఆమెను శాంతింపజేయడానికి, శివుడు ఉత్తర దిశలో నిద్రిస్తున్న ప్రాణి తలను తేవలసిందిగా ఆదేశించి పంపగా, వారు ఒక ఏనుగును ఆ స్థితిలో కనుగొన్నారు. దాని తలను ఆ బాలుడిపై ఉంచి, అతడిని గణేశునిగా తిరిగి బ్రతికించారు.ఈ కథను మొదటిసారి వినేవారికి, ఇది అసంబద్ధంగా అనిపించి, అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది. శివుడు సర్వమూ తెలిసినవాడు, సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు. భూత భవిష్యత్ వర్తమానాలను చూడగలిగిన శివుడు అంత కోపంగా, కఠినంగా ఎలా ప్రవర్తించగలడు?. రెండవది, ఆ బాలుడు తన కుమారుడే అని అతనికి తెలియదా?. మూడవది, అలా తెలియదు అనుకున్నా, పార్వతి స్నానం చేస్తున్న కారణంగా, కొద్దిసేపు మాత్రమే, ఆ బాలుడు అతడిని ఆపాడు. అంతలోనే శివుడు అంత అసహనానికి ఎందుకు గురయ్యాడు?. ఈ కథను అక్షరాలా తీసుకుంటే, శివుడు కోపిష్టిగా, కఠినాత్ముడిగా, హింసాత్మకంగా, తార్కిక ఆలోచన లేనివాడిగా కనిపిస్తాడు. తన కుమారుని పట్ల అంత క్రూరంగా ఉండే దేవుడు ఇతరులను ఎలా రక్షించగలడని మీరు ఆలోచిస్తారు.అయితే, ఈ కథలోని అంతరార్థం ఒక అద్భుతమైన విషయాన్ని మనకు సూచిస్తుంది. శివుడు అతీంద్రియమైన చైతన్యానికి సూచిక. శివతత్వం అనేది ఎల్లప్పుడూ శాంతియుతంగా, అంతటా వ్యాపించి ఉన్న ఆత్మ, చైతన్యం. ఈ సమస్త సృష్టిలో అవ్యక్తంగా ఉన్న శక్తి శివుడైతే, వ్యక్తంగా ఉండి, బయటకు కనిపించే శక్తి స్వరూపమే, ప్రకృతియే పార్వతి. ఆమె శరీరపు మురికి, లేదా మలినం అనేది ప్రకృతిలోని వక్రతను, ప్రకృతిలో సహజంగా పేరుకునే అజ్ఞానాన్ని సూచిస్తుంది. స్వచ్ఛమైన నీటితో కలిసిన బురదలాగా ఈ మలినం లేదా అజ్ఞానం అనేది ఆత్మను కప్పివేస్తుంది. పార్వతి ఈ మలినాలలోకి జీవాన్ని ప్రవేశపెట్టింది అంటే బాహ్య ప్రకృతి నుండి జీవాత్మ (జీవాత్మ) అయిన గణేశుడిని సృష్టించింది.ప్రకృతి (ప్రకృతి), వికృతి (శక్తి వక్రీకరణ) ఒకే పూర్ణత్వంలో భాగాలు. నశించిపోవటం అనేది ప్రకృతిలో భాగం. వ్యర్థాలనుండి తయారైన ఎరువు చెట్టు పెరుగుదలకు తోడ్పడినట్లే, వికృతి అనేది సృష్టిని కాపాడుతూ ఉంటుంది. మరణం సైతం జీవితానికి మద్దతు ఇస్తుంది. మీ శరీరంలోని అనేక కణాలు ప్రతిరోజూ చనిపోతున్నాయి కాబట్టే అక్కడ కొత్త కణాలు పుట్టే అవకాశం ఉంటుంది. దీనిని లేశ అవిద్య అంటారు. కొద్దిపాటి వక్రత, లేదా సాపేక్ష శక్తి అవసరం. మీరు విశ్వచైతన్యపు, ఏకత్వపు లోతుల్లోకి (ధ్యానంలోకి) వెళ్ళినప్పుడు, మీరు ఒక్కరే ఉంటారు. కాని, దాని నుండి ప్రపంచానికి తిరిగి రావాల్సి వచ్చినప్పుడు, కనీసం ‘నేను గొప్ప ధ్యానం చేసాను’ అని చెప్పడానికైనా అక్కడ మరొకరు ఉండాలి కదా. పూర్ణమైన (అలౌకిక) ప్రపంచం నుండి, మీరు సాపేక్ష ప్రపంచానికి రావాలి. ఈ లౌకిక ప్రపంచం ఉండేందుకు, ఆ పూర్ణత్వాన్ని గుర్తించి, కీర్తించేందుకు మీరు లౌకిక ప్రపంచంలోకి రావాలి.కనిపించే (వ్యక్త) ప్రపంచం, కనిపించని (అవ్యక్త) ప్రపంచమూ రెండూ కలిసి ఉంటాయి. అవ్యక్త ప్రపంచం బయటకు కనిపించే దానిని కీర్తిస్తుంది, కనిపించే ప్రపంచం అవ్యక్తాన్ని కీర్తిస్తుంది అవే శివుడు, శక్తి. పార్వతి స్నానం చేయటం అనేది, ప్రకృతి తాను తన స్వచ్ఛతలో, అంటే చైతన్యంలో కలిసే ప్రయత్నాన్ని సూచిస్తుంది. శివుడు పురుషుడిని సూచిస్తాడు అంటే స్వచ్ఛమైన, అద్వితీయమైన చైతన్యం. అక్కడ ఎటువంటి కల్మషమూ ఉండలేదు. ‘శివుడు బాలుడిని శిరచ్ఛేదం చేయడం’ అంటే అన్ని మలినాలను తొలగించడం తప్ప మరొకటి కాదు. తల అనేది బుద్ధిని సూచిస్తుంది, జ్ఞానాన్ని కనుగొనాలంటే బుద్ధి మారాలి. మీరు ఎప్పటికీ ఆలోచిస్తూనే ఉంటే, ఎప్పటికీ అనుభవాన్ని పొందలేరు. ఆధ్యాత్మిక ప్రయాణం అంటే తల (బుద్ధి) నుండి హృదయానికి, ఆలోచన నుండి అనుభూతికి, అనుభవానికి వెళ్లడం.ఏనుగు అతిపెద్ద తల కలిగి ఉండి, అపారమైన జ్ఞానాన్ని సూచిస్తుంది. జ్ఞానేంద్రియాలను కర్మేంద్రియాలను ఒకేదానిలో దాని తొండంలో కలిగి ఉంది. దాని తొండంతో, అది విషయాలను గ్రహించగలదు. ఆ తొండంతోనే పనులు కూడా చేయగలదు. అంతే కాదు, ఏనుగు తన చెవులను అదేపనిగా కదిలిస్తూ ఉంటుంది. వింటున్న దానికి, చూస్తున్న దానికి మధ్య సామరస్యాన్ని మనకు బోధిస్తుంది, ఇది సమగ్ర జ్ఞానంగా ఉంటుంది. గణేశునికి ఏనుగు తలను ఉంచడం అంటే పూర్తి జ్ఞానాన్ని స్థాపించడం అని అర్థం. అది అడ్డంకులను తొలగించి తెలివిని (బుద్ధి), సాఫల్యాన్ని (సిద్ధి) ప్రసాదించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అదే గణపతి సూత్రం.అందువల్లే మనం ఇంటి ముఖద్వారం వద్ద గణేశుడిని ఉంచుతాము, ఇది ప్రకృతి, చైతన్యం సమాగమం అయ్యే స్థానాన్ని సూచిస్తుంది. మీరు గణేశుడిని మీ ఇంట్లోకి లేదా హృదయంలోకి తీసుకువచ్చినప్పుడు, విగ్రహం వద్దే ఆగిపోకండి. ఆ రూపం కరిగిపోయి, గణేశుడు మీలో ఉన్నాడని మీరు గ్రహించే వరకు ఆ గణేశతత్త్వాన్ని ధ్యానించండి.-గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్. -
సకల శుభాలు, విజయాలు సిద్ధించాలి: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నేడు వినాయకచవితి. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.వినాయకచవితి సందర్భంగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్..‘రాష్ట్ర ప్రజలందరికీ గణనాథుని ఆశీస్సులు ఉండాలి. క్షేమ, స్థైర్య, ఆయురారోగ్యాలు, సకల సంపదలు సిద్ధించాలి. సకల శుభాలు కలగాలి. విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మంచి పనులకు విఘ్నాలు తొలగిపోవాలి. ప్రజలందరికీ సకల శుభాలూ కలిగి, విజయాలు సిద్ధించాలి. గణనాథుని కరుణా కటాక్షాలతో రాష్ట్రంలోని ప్రతి కుటుంబం సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలి’ అని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలిపారు. అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగి విజయాలు కలిగేలా ఆ విఘ్నేశ్వరుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.#VinayakaChaturthi2025— YS Jagan Mohan Reddy (@ysjagan) August 27, 2025 -
ఖైరతాబాద్ మహా గణేశుడి తొలిపూజలో గవర్నర్ తమిళి సై
హైదరాబాద్: ఖైరతాబాద్ లో కొలువుదీరిన 63 అడుగుల మహా గణేశుడికి తొలిపూజ జరిగింది. పూజా కార్యక్రంమలో తెలంగాణ గవర్నర్ తమిళి సై, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని, దానం నాగేందర్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఖైరతాబాద్ లో గణేశుడు ఈసారి శ్రీ దశ విద్యా మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఈరోజు మహాగణపతి నిర్వహించిన తొలిపూజలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సహా పలువురు ప్రముఖులు హాజరుకాగా భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్బంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు గాని సమస్యలు గాని తలెత్తకుండా అన్ని విభాగాలను సమన్వయము చేశామన్నారు. ప్రభుత్వం తరపున ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. నిమజ్జనం వరకు కూడా ఈ ఏర్పాట్లు కొనసాగుతాయని ఆయన తెలిపారు. గవర్నర్ తమిళి సై మహా గణేశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. తెలంగాణ ప్రజలు అంతా సుఖశాంతులతో, ఆరోగ్యాంగా ఉండాలని ఖైరతాబాద్ గణేషుడిని కోరుతున్నానన్నారు. ఇది కూడా చదవండి: Traffic Diversions:నేడు మహాగణపతికి గవర్నర్ తమిళిసై పూజలు.. -
ఎంత స్టార్ హీరో సినిమా అయినా వినాయకుడి పూజతో ప్రారంభించాల్సిందే!
శివపార్వతుల ముద్దుల కొడుకు విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈపర్వదినాన్ని కన్నులపండుగగా జరుపుకొంటారు. భారతీయ సమాజంలో వినాయక చవితికి విశిష్టమైన ప్రాముఖ్యం ఉంది, ఆది దంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు, ఆ గణనాథుని కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం. అందుకే ఇండస్ట్రీలో ఏ సినిమా ప్రారంభించినా మొదట వినాయకుడి పూజతోనే ప్రారంభం అవుతుంది. బేబీ నుంచి భగవంత్ కేసరి వరకు బొజ్జ గణపయ్యే వినాయక చవితి వస్తుందంటే గ్రామీణ ప్రాంతాల నుంచి దేశవ్యాప్తంగా పండగ వాతావరణం కనిపిస్తుంది. ఎక్కడ చూసినా వినాయకుడి మండపాలతో పాటు భక్తుల కోలాహలం కనిపిస్తుంది. అలా నవరాత్రుల్లో ఊరూవాడల్లో సందడి కనిపిస్తుంది. సినిమా అంటే ఎవరికైనా ఒక ఎమోషన్ అందుకే మన ప్రతి పండుగలో సినిమా ఉంటుంది. అలాగే చాలా సినిమాల్లో మన పండుగలు, సంప్రదాయాలు కనిపించేలా మేకర్స్ చిత్రీకరిస్తారు. అందులో భాగంగా చాలా సినిమాల్లో వినాయకుడు ప్రతిమ ఇతి వృత్తంగా సినిమాలు చాలానే వచ్చాయి. మెగాస్టార్ కూడా జై చిరంజీవ సినిమాలో వినాయకుడి గొప్పతనాన్ని చాటుతూ స్టెప్పులేశాడు. ఈ మధ్య విడుదలైన బేబీ సినిమాలో కూడా హీరోయిన్ వైష్ణవి ఎంట్రీ కూడా మన గణపతి ముందు వేసిన స్టెప్పులతోనే ప్రారంభం అవుతుంది. బాలయ్య భగవంత్ కేసరి నుంచి తాజాగా విడుదులైన మొదటి పాట కూడా బొజ్జ గణపయ్యతోనే ప్రారంభం అవుతుంది. అందులో శ్రీలీల వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇప్పుడు ప్రతి గణేషుడి మండపం వద్ద ఈ పాటు మారుమ్రోగుతుంది. అంతలా వినాయకుడు సినిమాలో భాగం అయిపోయాడు. వినాయకుడిలో తమ హీరోను చూసుకుంటున్న ఫ్యాన్స్ వినాయకుడు అంటే అందరికీ ఎంతో ప్రీతి.. ఆయన రూపం అందరినీ మెప్పిస్తుంది. అందుకే పలువురి హీరోల ఫ్యాన్స్ ఈ వేడుకలకు సినిమాలనూ జోడించి సంబరాలు చేసుకుంటారు. ఈ ట్రెండ్ చాలా ఏళ్ల నుంచే ప్రారంభం అయింది. ఈ ఏడాది కూడా ప్రేక్షకాదరణ పొందిన సినిమాలలోని పాత్రల రూపంలో గణేశుడి విగ్రహాలను ప్రతిష్ఠించి యువత గణపతి పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. అందులో భాగంగా ఈ వినాయక పండగకు కూడా కొలువుదీరిన విగ్రహాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాహుబలి వినాయకుడు భారతీయ సినీ అభిమానులను విశేషంగా అలరించిన సినిమా బాహుబలి. అందులో ప్రభాస్ మహేంద్ర బాహుబలిగా భారత ప్రజలందరికీ దగ్గరయ్యాడు అంతలా ఆ పాత్రకు గుర్తింపు వచ్చింది. ఇప్పటికీ బాహుబలి రూపంలో గణేశుడి విగ్రహాలు ట్రెండ్‌లో ఉన్నాయి. ఇలా ప్రత్యేకంగా తమ ఫ్యాన్స్ అడిగి మరీ తయారు చేయించుకుంటున్నారు. వినాయకుడి రూట్లో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్‌తో పాటు నేషనల్ అవార్డ్ రావడంతో మళ్లీ ఈ మూవీ ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఇందులో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపిస్తే ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో కనిపించాడు. ఇప్పుడు ఫ్యాన్స్ వారిని వినాయకుడి రూపంలో విగ్రహాలు చేపించి తమ భక్తితో పాటు అభిమానాన్ని చాటుతున్నారు. అల్లూరి పాత్రలో రామ్ చరణ్ విల్లు చేతబట్టి బాణాలు సందిస్తూ కనిపించిన చరణ్ ఇప్పుడు అదే లుక్‌లో గణేశుడి విగ్రహాలు రెడీ అయ్యాయి. మరోవైపు కొమురం భీం (ఎన్టీఆర్) ఇంటర్వెల్ సీన్లో ఎంట్రీ అదుర్స్ అనేలా ఉంటుంది. తారక్ ఒక వాహనం నుంచి దుకుతుంటే ఆయన చుట్టూ అడివి జంతువులు కూడా ముందుకు దూకుతాయి. ఇదే సింబల్ కనిపించేలా వినాయకుడి ప్రతిమలు రెడీ అయ్యాయి. ఈ ట్రెండ్ కోలీవుడ్‌లోనూ ఉంది.. లియో- గణనాథుడు విజయ్- లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న లియో సినిమా ప్రకటన సందర్భంగా వారిద్దరినీ కలుపుతూ ఓ వైపు గణేశుడు, మరోవైపు సింహంతో విగ్రహాన్ని రూపొందించారు. అలాగే, లియో సినిమా పేరు ప్రకటన వీడియోలో నటుడు విజయ్ బ్లడీ స్వీట్ చెప్పే సన్నివేశం చుట్టూ రూపొందించిన మరో విగ్రహం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ విగ్రహం 8 అడుగుల పొడవు ఉండగా లక్షకు పైగా ఖర్చు అయినట్లు సమాచారం. 25 రోజుల పాటు, ఐదుగురు శిల్పులు ఈ విగ్రహాన్ని రూపొందించారు. నేషనల్ అవార్డుతో తగ్గేదే లే అంటున్న పుష్ప- వినాయకుడు గత సంవత్సరం ఎక్కడ చూసినా కూడా వినాయకుడి రూపంలో అల్లు అర్జున్ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమాతో ఆయనకు నేషనల్ అవార్డు దక్కడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. అందుకే బన్నీపై అభిమానంతో తమకు ఎంతో ఇష్టమైన బొజ్జ గణపయ్య రూపంలో విగ్రహాలు రెడీ చేపించారు. ఇలా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణేశ్ విగ్రహాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
వినాయకచవితి స్పెషల్.. బన్నీ కూతురు ఏం చేసిందో తెలుసా?
వినాయకచవితి వచ్చిందంటే చాలు ఏ గల్లీలో చూసిన సందడే సందడి. ముఖ్యంగా చిన్నపిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. ఎలాగైనా సరే గణపతి తయారు చేసి మరీ సెలబ్రేట్ చేసుకుంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలు మట్టితో చాలా సరదాగా వినాయక విగ్రహాన్ని తయారు చేయడం మనం చూస్తుంటాం. అలా ఐకాన్ స్టార్ గారాల పట్టి అల్లు అర్హ వినాయకచవితి కోసం బుజ్జి వినాయకుడిని తయారు చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. (ఇది చదవండి: Allu Arha In Devara: దేవుడా.. రెండో సినిమాకే లక్షలు తీసుకుంటున్న అల్లు అర్హ! ) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అర్హ అంటే టాలీవుడ్లో తెలియని వారుండరు. కాగా.. అల్లు అర్హ ఇప్పటికే సినిమాల్లో నటిస్తోంది. ఈ ఏడాది సమంత నటించిన శాకుంతలం చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో అర్హ భరతుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించింది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర చిత్రంలో అల్లు అర్హ నటించనున్నట్లు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. జాన్వీ చిన్ననాటి పాత్రలో అర్హ నటించనుందని సమాచారం. ఇప్పటికైతే మేకర్స్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. View this post on Instagram A post shared by Pinkvilla South (@pinkvillasouth) -
నిమజ్జనం నిరుటి మాదిరే
సాక్షి, సిటీబ్యూరో: వినాయకచవితి పండగ సమీపిస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు ఎక్కడి వారు అక్కడే తమకు దగ్గరి ప్రాంతాల్లో నిమజ్జనాలు చేసేందుకు వీలుగా కొలనులు సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జీహెచ్ఎంసీ నిమజ్జనాల కోసమే నిర్మించిన కొలనులతోపాటు ప్రీ ఫ్యాబ్రికేటెడ్ పోర్టబుల్ కొలనులు, తాత్కాలికంగా నిర్మించే కొలనుల్ని నిమజ్జనాల కోసం వినియోగించనున్నారు. నిమజ్జనాల కోసమే నిర్మించిన కొలనుల్ని బేబీపాండ్స్గా వ్యవహరిస్తున్నారు. నిర్వహణలేక వ్యర్థాలతో నిండిపోయిన బేబిపాండ్స్‌ను శుభ్రం చేయడంతోపాటు, తాత్కాలిక చెరువుల పనులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కోరారు. శుక్రవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందికి గణేష్ మట్టి విగ్రహాలు మేయర్ పంపిణీ చేశారు. -
వినాయక చవితి వేడుకల్లో గవర్నర్, సీఎం
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి పర్వదినం సందర్భంగా శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రగతి భవన్లో జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ దంపతులు గణనాథునికి పూజలు నిర్వహించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దంపతులతో పాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ పూజల్లో పాల్గొన్నారు. భౌతిక దూరం పాటిస్తూ.. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై దంపతులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్బార్ హాల్లో జరిగిన పూజా కార్యక్రమాల్లో గవర్నర్ కార్యాలయ ఉద్యోగులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కోవిడ్–19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భౌతిక దూరం పాటిస్తూ ఈ వేడుకలు నిర్వహించాలని గవర్నర్ పిలుపునిచ్చారు. -
బైబై గణేశా..
ఎదులాపురం(ఆదిలాబాద్): పదకొండు రోజులపాటు పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడికి చేరాయి. ఆదివారం ఆదిలాబాద్ పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్ర కన్నుల పండువగా సాగింది. ఆనందోత్సహాల నడుమ ఆయా వినాయక మండపాల వారు నృత్యాలు, కోలాటాల మధ్య గణపయ్యకు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా యువకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ప్రత్యేక వాహనాల్లో ఏర్పాటు చేసిన సెట్టింగ్‌లు మైమరిపించాయి. నిమజ్జన శోభాయాత్రను చూసేందుకు భక్తులు జిల్లా కేంద్రం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా మున్సిపాలిటీ, పలు సంఘాలు, పార్టీల ఆధ్వర్యంలో మంచినీటి వసతి, తాత్కాలిక మరుగుదొడ్ల సౌకర్యం కల్పించారు. పులిహోర, తదితర వాటిని భక్తులకు పంపిణీ చేశారు. మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడుకుందాం.. మట్టి విగ్రహాలతో పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదని, వచ్చే ఏడాది ప్రతిఒక్కరూ మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పర్యవరణ పరిరక్షణకు సహకరించాలని ఆపద్ధర్మ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. కులమతాలకు అతీతంగా ఆనందోత్సాహాలతో పండుగలను జరుపుకోవాలని అన్నారు. ఆదివారం పట్టణంలోని వినాయక్‌చౌక్‌లో గల శ్రీ సరస్వతి శిశుమందిర్ పాఠశాలలో హిందు ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిమజ్జన శోభాయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ప్రతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవాలని అన్నారు. ప్రతియేటా నిర్వహించే గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఆదిలాబాద్‌లో ప్రజలందరూ ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటారని పేర్కొన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతియుతంగా నిమజ్జన కార్యక్రమాన్ని ముగించాలని కోరారు. ప్రతియేటా రాష్ట్ర ఖైరతాబాద్‌లో భారీ వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించేవారని, ఈసారి జిల్లాకేంద్రంలో 58 అడుగుల భారీ వినాయకుడిని ప్రతిష్టించి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేకతను చాటిచెప్పారని అన్నారు. అంతకుముందు సరస్వతీ పాఠశాలలో ప్రతిష్టించిన గణనాథునికి కలెక్టర్ దివ్యదేవరాజన్, ఎస్పీ విష్ణు ఎస్.వారియర్, బీజేపీ నాయకులు పాయల శంకర్, హిందు ఉత్సవ సమితి నాయకులు జంగిలి ఆశన్న, తదితరులతో కలిసి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు హిందు ఉత్సవ సమితి నాయకులు పాల్గొన్నారు. అలరించిన నృత్యాలు.. వినాయక నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో యువకులు చేసిన నృత్యాలు అలరించాయి. దీంతోపాటు గుస్సాడీ వేషధారణలో చేపట్టిన నృత్యాలు మైమరిపించాయి. బ్యాండ్ మేళాలతో యువతీ యువకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయంగా భజనలు చేస్తూ వినాయకులను నిమజ్జనానికి తరలించారు. పట్టణంలో నిమజ్జన శోభాయాత్రను తిలకించేందుకు భారీ ఎత్తున భక్తులు చేరుకోవడంతో సందడి వాతావరణం నెలకొంది. భారీ పోలీసు బందోబస్తు.. పట్టణంలో వినాయక నిమజ్జన శోభాయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు ప్రత్యేక బలగాలతో నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బందోబస్తులో ఇద్దరు ఏఎస్పీలు, నలుగురు డీఎస్పీలు, 11 మంది సీఐలు, 40 మంది ఎస్సైలు, 390 మంది ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. వీరితో పాటు బాంబ్‌స్క్వాడ్, డాగ్‌స్క్వాడ్, షీటీమ్ పోలీసులు విధులు నిర్వహించారు. కరీంనగర్ డీఐజీ ప్రమోద్‌కుమార్ గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆదిలాబాద్ పట్టణంలో పర్యవేక్షించారు. -
గంగ ఒడికి.. గౌరీ తనయుడు
సాక్షి, హైదరాబాద్: మహానగర దారులన్నీ భక్తజనసంద్రమయ్యాయి. గల్లీలన్నీ జైగణేష నినాదాలతోహోరెత్తిపోయాయి. కోలాటాలు, కీర్తనలు, నృత్యాల నడుమ గణపయ్యలను గంగ ఒడికి సాగనంపారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై గణేషుడినిఉంచి శోభాయాత్రలో పాల్గొన్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించేందుకు దాదాపు మూడు లక్షల మంది భక్తులు హుస్సేన్ సాగర్ తీరానికి తరలివచ్చారు. పలు చోట్ల లడ్డూప్రసాదాన్ని సొంతం చేసుకునేందుకు భారీఎత్తున పోటీ పడ్డారు. ఆదివారం ఉదయమే ప్రారంభమైన శోభాయాత్ర, నిమజ్జనక్రతువులు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. మూడు కమిషనరేట్లలో సుమారు ఇరవై వేల సీసీకెమెరాలను డీజీపీ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేసి డీజీపీ మహేందర్‌రెడ్డి పర్యవేక్షించగా, కమిషనర్లు అంజనీకుమార్, మహేశ్ భగవత్, వీసీ సజ్జన్నార్ పాలుపంచుకున్నారు. సాయంత్రం నాయిని నర్సింహారెడ్డి, మహేందర్‌రెడ్డి, కమిషనర్లు దానకిషోర్, అంజనీకుమార్ ప్రత్యేక హెలిక్యాప్టర్‌లో ఏరియల్ వ్యూ చేసి పరిస్థితిని సమీక్షించారు. ఖైరతాబాద్ సప్తముఖ కాలసర్ప మహాగణపతి శోభాయాత్ర ఉదయం 7:05 గం.కే ప్రారంభమైంది. మధ్యాహ్నం 12:50గం.కు హుస్సేన్‌సాగర్‌లోని ఆరవ నంబర్ క్రేన్ వద్దకు చేరుకోగా.. ప్రత్యేక క్రేను సాయంతో నిమజ్జనాన్ని పూర్తిచేశారు. ఖైరతాబాద్ గణేషుడి చరిత్రలో ఇంత త్వరగా నిమజ్జనం చేయటం ఇదే తొలిసారి అని నిర్వాహకులు చెప్పారు. బాలాపూర్ లడ్డూరూ.16.60 లక్షలకు శ్రీనివాసగుప్తా, ఫిలింనగర్ శివాజీనగర్ లడ్డూ రూ.15 లక్షలకు తన్నీరు రాములు, కూకట్పల్లి హౌజింగ్ బోర్డు సర్దార్ పటేల్ నగర్లో రూ.11.76 లక్షలకు పీవీ రమణారెడ్డిలు దక్కించుకున్నారు. రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని శ్రీనివాస గుప్తా ప్రకటించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల కేంద్రంలోని రచ్చబండ వినాయకుని లడ్డూను వేలంలో రూ. 16లక్షల 1001లకు చేవెళ్లకు చెందిన ఆగిరెడ్డి డీవీఆర్ గ్రూపు సభ్యులు దక్కించుకున్నారు. -
గణనాథా... ఇక సెలవు
స్టేషన్ మహబూబ్‌నగర్: అందరి విఘ్నాలు తొలగించే వినాయకుడికి తొమ్మిది రోజుల పాటు పూ జలు చేసిన భక్తులు శనివారం నిమజ్జనోత్సవాన్ని అంతే వేడుకగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని బాలగంగాధర్‌తిలక్ విగ్రహం వద్ద గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యాన సమితి గౌరవ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ ధ్వజారోహణ చేశారు. అనంతరం క్లాక్‌టవర్‌లో నిర్మించిన వేదికను ఎమ్మెల్యే ప్రారంభించారు. గణనాథుల ఊరేగింపు... క్లాక్‌టవర్ చౌరస్తా నుంచి అటు పాత గ్రంథాల యం వరకు, ఇటు పాత బస్టాండ్, రాయచూరు రోడ్డు తదితర ప్రాంతాలు నిమజ్జనానికి తరలివెళ్లే గణపతి విగ్రహాల ఊరేగింపు కొనసాగింది. గడియారం చౌరస్తా ప్రాంతానికి వేలాదిగా భక్తులు తరలిరావడంతో జాతరను తలపించింది. విభి న్న, విచిత్ర రూపాలు, సెట్టింగులతో కూడిన వినాయక విగ్రహాలు తీర్చిన రథాలు చిన్నాపెద్దా అంద రినీ అలరించాయి. క్లాక్‌టవర్‌లోని వేదిక నుంచి ఎంపీ జితేందర్‌రెడ్డి, కలెక్టర్ రొనాల్డ్‌రోస్, మాజీ ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఎర్ర శేఖర్, మున్సిపల్ చైర్పర్సన్ రాధ, వైస్ చైర్మన్ రాములుతోపాటు గణేశ్ ఉత్సవ సమితి అధ్యక్షుడు మద్ది యాదిరెడ్డి ప్రధాన కార్యదర్శి బాలయ్య, పడాకుల రాంచం ద్రయ్య, రాజేశ్వర్‌గౌడ్, గోపాల్‌యాదవ్, బుచ్చారెడ్డి, పట్లోళ్ల లక్ష్మారెడ్డి, పద్మజాయాదవ్, శాంతికుమార్, మల్యాద్రి రెడ్డి, నలిగేశి లక్ష్మీనారాయణ తదితరులు గణనాథులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గణపతిబొప్ప మోరియా అంటూ భక్తుల నినాదాలతో ఆధ్యాత్మికత నెలకొంది. పూజలు.. బందోబస్తు మహబూబ్‌నగర్ క్రైం : నిమజ్జనం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన గణనాథుడికి ఎస్పీ రెమారాజేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎస్పీ రాత్రి క్లాక్‌టవర్, అంబేద్కర్ చౌరస్తా, పాతపాలమూరు. పాన్ చౌరస్తాల్లో గణేష్ శోభాయాత్రను ఏఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీ భాస్కర్‌తో కలిసి పరిశీలించారు. ఇక నిమజ్జనంలో ఇద్దరు డీఎస్పీలు, 9మంది సీఐలుతో పాటు ఎస్ఐలు, ఏఎస్సైలు, హెడ్‌కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోం గార్డులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇక క్లాక్‌టవర్ వద్ద పూజలు చేశాక విగ్రహాలను హన్వాడ, బీచుపల్లి, రంగపూర్ వైపు పంపించారు. అలాగే, ఐదున్నర అడుగులు ఉన్న విగ్రహాలను బీచుపల్లి, రంగపూర్‌కు తరలిం చడానికి ఆర్టీఏ, మున్సిపల్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బీచుపల్లి, రంగపూర్‌కు గణనాథులను తరలించడానికి మున్సిపాలిటీ మైదానంలో 20 లారీలు ఏర్పాటు చేశారు. ఎంవీఐ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు జావేద్‌బేగ్ పర్యవేక్షించారు. ఇక స్థానిక మున్సిపల్ మైదానంలో ఐదు శాఖల అధికారులను కలిపి కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. శోభాయాత్ర సందర్భంగా క్లాక్ టవర్‌లో భక్తుల రద్దీ వాహనంపై భారీ గణనాథుడు యువతుల సంబరం ప్రతిభ కళాశాలలో పూజలు చేస్తున్న యాజమాన్యం, విద్యార్థులు -
ప్రతీ ఇంట్లో సుఖసంతోషాలు నింపాలి: వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం తెలుగు రాష్ట్రాల ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలియజేశారు. వినాయకుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సుఖ సంతోషాలు నింపాలని కోరుకున్నారు. ఈ మేరకు తన ట్విటర్ అకౌంట్లో ట్వీట్ చేశారు. వినాయకచవితి పండుగ సందర్భంగా ప్రజాసంకల్పయాత్రకు గురువారం విరామం ప్రకటించిన సంగతి తెల్సిందే. పాదయాత్ర తిరిగి శనివారం విశాఖపట్నంలోని చినగదిలి నుంచే ప్రారంభమవుతుందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల వెల్లడించారు. On this happy occasion of #VinayakaChavithi, May Lord Ganesha bless your home with much love, joy and prosperity. — YS Jagan Mohan Reddy (@ysjagan) September 13, 2018 -
వైఎస్ జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి దీవెనలతో అభివృద్ధిపరంగా ఇరు రాష్ట్రాలకు, ఇరు రాష్ట్రాల ప్రజలకు విఘ్నాలు తొలగి ఇకమీదట అనేక విజయాలు సిద్ధించాలని ఆయన కోరుకున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి బుధవారం ప్రకటన వెలువడింది. కాగా, ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ బుధవారం విశాఖపట్నం తూర్పు అసెంబ్లీ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ, భరోసాయిస్తూ ముందుకు సాగుతున్నారు. బీఆర్టీఎస్ రోడ్డులో చినగదిలి వద్ద ఈ మధ్యాహ్నం జరిగే ముస్లిం మైనారిటీల ఆత్మీయ సదస్సులో వైఎస్ జగన్ పాల్గొంటారు. -
పారద గణపతి
పాదరసంతో తయారుచేసిన గణపతినే ‘పారద గణపతి’ అంటారు. పాదరసంతో తయారు చేసిన శివలింగాలను విరివిగా పూజిస్తూ ఉంటారు. పారదలింగాల ఆరాధన విశేష ఫలప్రదమైనది. అలాగే పాదరసంతో తయారు చేసిన గణపతిని అర్చించడం కూడా గొప్ప ఫలితాలనిస్తుంది. జ్ఞానవృద్ధి, మనోస్థైర్యాల కోసం పారద గణపతి ఆరాధన చక్కని సులభమార్గం. వినాయక చవితిరోజున పూజమందిరంలో చేతి బొటనవేలి పరిమాణంలో ఉండే పారద గణపతిని ప్రతిష్ఠించి పూజించడం మంచిది. వినాయక చవితినాడు వీలు కాకుంటే ఏదైనా నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున పారద గణపతిని పూజమందిరంలో ప్రతిష్ఠించుకోవడం మంచిది. పాదరసంతో లక్ష్మీదేవితో కలసి ఉన్న గణపతి రూపాన్ని ఒకేమూర్తిగా తయారు చేయించిన పారద లక్ష్మీగణపతిని పూజించినట్లయితే ఆర్థిక ఇక్కట్లు, ఆటంకాలు తొలగిపోతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ముఖ్యంగా వ్యాపార సంస్థల్లో పారద లక్ష్మీగణపతిని పూజించడం వల్ల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పారద గణపతిని లేదా పారద లక్ష్మీగణపతిని పూజమందిరంలో ప్రతిష్ఠించిన తర్వాత నిత్య ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. – పన్యాల జగన్నాథ దాసు -
శుక్రవారం మార్కెట్లకు సెలవు
ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లకు రేపు సెలవు ప్రకటించారు. వినాయక చతుర్ధి సందర్భంగా శుక్రవారం(25న) బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పనిచేయవు. శనివారం ఆదివారం రెండురోజులు కూడా సెలవే. దీంతో మళ్లీ వచ్చే సోమవారం(28న) యథావిధిగా ఉదయం 9.15కు ట్రేడింగ్ ప్రారంభమవుతుంది. మరోవైపు దేశవాప్తంగా గణేష్ చతుర్ధి వేడుకలకు సర్వం సన్నద్ధమవుతోంది. వాడవాడలా బొజ్జగణపతి విగ్రహస్థాపన, పూజాకార్యక్రమాలను నిర్వహించేందుకు, నవరాత్రి ఉత్సవాలను సంబరంగా చేసుకునేందుకు పిల్లా పెద్దా ఉత్సాహంగా కదులుతోంది. అటు మార్కెట్లు కూడా పూలు, పత్రి, రకరకాల వినాయక ప్రతిమలతో సిద్ధంగా ఉన్నాయి. మట్టి గణపతినే పూజిద్దాం..పర్యాపరణాన్ని పరిరక్షిద్దాం! పాఠకులకు, ఇన్వెస్టర్లకు వినాయక చవితి శుభాకాంక్షలు! -
జోరందుకున్న వినాయక విగ్రహాల విక్రయాలు
కుల్కచర్ల: వినాయక చవితి దగ్గర పడుతుండటంతో మండల కేంద్రంలో వినాయక విగ్రహాల అమ్మకాలు ఊపందుకున్నాయి. మండల కేంద్రంలో అన్ని రకాల విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. గతంలో మండల ప్రజలు ,యువకులు పెద్ద వినాయకుల కోసం మహబూబ్‌నగర్, షాద్‌నగర్, హైదరాబాద్‌కు వెళ్లి తీసుకవచ్చే వారు కానీ వ్యాపారులు ప్రజలకు ఆఇబ్బందులు లేకుండా చేశారు. మండల కేంద్రంలో చిన్న వినాయకుడి నుంచి 12 అడుగుల వినాయక విగ్రహాల వరకు దొరుకుతున్నాయి. రూ. 50 నుంచి రూ. 12వేల వరకు ఉన్నాయి. గ్రామాల నుంచి వచ్చిన యువకులు ముందుగానే బుగింక్ చేసుకుంటున్నారు.