శుక‍్రవారం మార్కెట్లకు సెలవు | stockmarkts remains close on behalf of Vinayakachavithi | Sakshi
Sakshi News home page

శుక‍్రవారం మార్కెట్లకు సెలవు

Aug 24 2017 6:09 PM | Updated on Nov 9 2018 5:30 PM

దేశీయ స్టాక్‌మార్కెట్లకు రేపు సెలవు ప్రకటించారు.

ముంబై:దేశీయ స్టాక్‌మార్కెట్లకు రేపు సెలవు ప్రకటించారు. వినాయక చతుర్ధి సందర్భంగా శుక్రవారం(25న)  బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. శనివారం ఆదివారం రెండురోజులు కూడా సెలవే. దీంతో మళ్లీ వచ్చే సోమవారం(28న) యథావిధిగా ఉదయం 9.15కు ట్రేడింగ్ ప్రారంభమవుతుంది.

మరోవైపు దేశవాప్తంగా గణేష్‌ చతుర్ధి వేడుకలకు సర్వం సన్నద్ధమవుతోంది. వాడవాడలా బొజ్జగణపతి విగ్రహస్థాపన, పూజాకార్యక్రమాలను నిర్వహించేందుకు, నవరాత్రి ఉత్సవాలను  సంబరంగా చేసుకునేందుకు పిల్లా పెద్దా ఉత్సాహంగా కదులుతోంది.   అటు  మార్కెట్లు కూడా పూలు, పత్రి,  రకరకాల వినాయక  ప్రతిమలతో  సిద్ధంగా ఉన్నాయి.

మట్టి గణపతినే పూజిద్దాం..పర్యాపరణాన్ని పరిరక్షిద్దాం!

పాఠకులకు, ఇన్వెస్టర్లకు వినాయక చవితి శుభాకాంక్షలు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement