
సాక్షి, హైదరాబాద్: వినాయక చవితి పర్వదినం సందర్భంగా శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రగతి భవన్‌లో జరిగిన వేడుకల్లో సీఎం కేసీఆర్ దంపతులు గణనాథునికి పూజలు నిర్వహించారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ దంపతులతో పాటు రాజ్యసభ సభ్యుడు సంతోష్‌కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, రైతు బంధు సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ పూజల్లో పాల్గొన్నారు.
భౌతిక దూరం పాటిస్తూ..
రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై దంపతులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్బార్ హాల్‌లో జరిగిన పూజా కార్యక్రమాల్లో గవర్నర్ కార్యాలయ ఉద్యోగులతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. కోవిడ్–19 పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని భౌతిక దూరం పాటిస్తూ ఈ వేడుకలు నిర్వహించాలని గవర్నర్ పిలుపునిచ్చారు.