
మారథాన్‌లో పతకాలు అభినందనీయం
జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్
నగరంపాలెం: అసాధారణమైన 42 కి.మీ మారథాన్ పరుగును కేవలం ఐదు గంటల్లోనే పూర్తి చేసి, పతకాలు సాధించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ప్రశంసించారు. హైదరాబాద్‌లో ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ పరుగు పందెం (2025) పోటీలను ఈనెల 23, 24వ తేదీల్లో నిర్వహించారు. ఇందులో నల్లపాడు పీఎస్ ఏఎస్‌ఐ కె.రాజశేఖర్ బాబు (4.42 గంటలు), జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) హోంగార్డు జి.కృష్ణకిషోర్ (4.59 గంటలు) పతకాలు సాధించారు. నగరంపాలెంలోని డీపీఓలో మంగళవారం జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ను ఏఎస్‌ఐ, హోంగార్డు మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయన వారిద్దరిని అభినందించారు. భవిష్యత్‌లో మరెన్నో పతకాలు సాధించాలని సూచించారు.
చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎస్పీ
నగరంపాలెం: జిల్లాలో వినాయక చవితి పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణపతి వేడుకలు, నిమజ్జనం కార్యక్రమాల్లో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన ఉత్సవ నిర్వాహకులకు సూచించారు. జిల్లా ప్రజలకు సకల శుభాలు కలగాలని, అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగిపోయి విజయాలు సిద్ధించాలని ఆయన తెలిపారు. గణనాథుడి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో అభివృద్ధిలో ముందడుగు వేయాలని ఎస్పీ ఆకాంక్షించారు.

మారథాన్‌లో పతకాలు అభినందనీయం