
● తగ్గని వరద ఉధృతి
అమరావతి: కృష్ణా నదిలో వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. అమరావతి వద్ద శనివారం కూడా కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలలో నిలిచిన నీరు కృష్ణానదిలోకి చేరాల్సి ఉంది. కానీ నదీ ప్రవాహం ఉధృతంగా ఉండటంతో ఎక్కడికక్కడే నీరు నిలిచిపోయింది. అమరావతి–విజయవాడ రోడ్డులో పెదమద్దూరు వద్ద వాగు చప్టాపై ఇంకా రెండు అడుగుల మేర నీరు ప్రవాహిస్తోంది. చప్టా శిథిలావస్థలో ఉండటం వల్ల అధికారులు రాకపోకలు నిలిపివేశారు. అమరావతి నుంచి విజయవాడ వెళ్లే బస్సులు పెదమద్దూరు వరకు నడుపుతున్నారు. విజయవాడ వెళ్లాలంటే ఆటోలో నరుకుళ్లపాడు ఎండ్రాయి, చావపాడు గ్రామాల మీదుగా సుమారు 10 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తుండటంతో ప్రయాణికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్‌శాఖ, రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

● తగ్గని వరద ఉధృతి