
మద్యం పాలసీలో మరిన్ని సడలింపులు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మద్యం పాలసీలో సడలింపులు తీసుకొచ్చినట్లు ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె.శ్రీనివాస్ తెలిపారు. శనివారం అరండల్‌పేటలోని ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత మద్యం పాలసీపై కొందరు చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దన్నారు. గతంలో బార్ షాపు నిర్వాహణలో ఉన్న అనేక నిబంధనలను సరళీకృతం చేశారన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధి దాటిన తర్వాత పది కిలో మీటర్లు పరిధిలో బార్ పెట్టుకునే అవకాశం ఉందన్నారు. బార్ నిర్వహణ ఉదయం 10 – రాత్రి 12 గంటల వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. 4 కంటే తక్కువ దరఖాస్తులు వస్తే వారు చెల్లించిన ఫీజులను వెనక్కి ఇచ్చే వెసులుబాటు కల్పించామన్నారు. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సమావేశంలో జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి అరుణ కుమారి తదితరులు ఉన్నారు.