
స్వచ్ఛ రేపల్లె సాధనకు సహకరించండి
ఆర్డీవో నేలపు రామలక్ష్మి
రేపల్లె: స్వచ్ఛ రేపల్లె సాధనలో పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని ఆర్డీవో నేలపు రామలక్ష్మి కోరారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఓల్డ్‌టౌన్ అంకమ్మ చెట్టు సెంటర్‌లో స్థానికులతో పరిసరాల పరిశుభ్రతపై శనివారం ప్రతిజ్ఞ చేయించారు. ఆర్డీవో మాట్లాడుతూ వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల ప్రమాదం ఉందని, అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురుగు కాలువలలో చెత్తను వేయరాదని, పారిశుద్ధ్య సిబ్బందికి మాత్రమే అందించాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ కే సాంబశివరావు, తహసీల్దార్ ఎం.శ్రీనివాసరావు, వైద్య సిబ్బంది, పట్టణ ప్రజలు, వివిధ పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.