
డాక్టర్ విశ్వేశ్వరరావుకు బంగారు పతకం
తెనాలిరూరల్: పట్టణ బోస్‌రోడ్డులోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) హాలులో బుధవారం రాత్రి సమావేశం నిర్వహించారు. సమావేశంలో పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు దివంగత డాక్టర్ కొత్త రవీంద్రబాబు ఽస్మారక ధార్మిక బంగారు పతకాన్ని గుంటూరుకు చెందిన ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ చేబ్రోలు విశ్వేశ్వరరావుకు బహూకరించారు. ఈ సందర్భంగా ‘కామన్ యూరలాజికల్ ప్రాబ్లమ్స్ అండ్ మేనేజ్‌మెంట్ గైడ్‌లైన్స్’పై డాక్టర్ విశ్వేశ్వరరావు ప్రసంగించారు. ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షుడు డాక్టర్ కె. అనిల్‌కుమార్, కార్యదర్శి డాక్టర్ మధుప్రభాకర్‌బాబు, డాక్టర్ కె. శ్యామ్‌ప్రసాద్, డాక్టర్ పావనిప్రియాంక, డాక్టర్ కొత్త రవీంద్రబాబు కుటుంబసభ్యులు, ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.