నెహ్రూనగర్: గుంటూరు జిల్లాలో గీత కులాలకు కేటాయించిన బార్లకు గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు బుధవారం విడుదల చేశారు. జిల్లా పరిధిలోని గుంటూరు నగరపాలక సంస్థలో గౌడకు 4, గౌడ్ 2, మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్స్‌లో గౌడకు 2, తెనాలి మున్సిపాలిటీ పరిధిలో గౌడకు, గౌడ్‌కు ఒకటి చొప్పున బార్‌లు కేటాయించడం జరిగిందన్నారు. ఆయా వర్గాలకు కేటాయించిన షాపుల్లో వారే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ నెల 29వ తేదీ దరఖాస్తులు స్వీకరిస్తామని 30న లాటరీ ద్వారా కేటాయింపు ఉంటుందన్నారు.
రైతులు పొగాకు సాగు చేయొద్దు
– జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు
నరసరావుపేట: జిల్లాలో పొగాకు పంటను రైతులు ఎవరూ సాగుచేయెద్దని, నారుమళ్లు వేయరాదని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు సూచించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 2024–25లో 3124మంది రైతులు 10,954 ఎకరాల్లో బ్లాక్ బర్లీ పొగాకు పంటను సాగుచేశారని, దీని వలన 1,21,010 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. అధిక దిగుబడితో పొగాకు వ్యాపారులు రైతుల నుంచి పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా పొగాకు కొనుగోలు చేపట్టిందన్నారు.
అందువలన ఈ ఏడాది రైతులు ఎవరూ కంపెనీ వ్యక్తుల నుంచి బాండ్లు తీసుకోరాదని, పొగాకు నారుమళ్లు వేయరాదని కోరారు. పొగాకుకు బదులుగా అధిక దిగుబడిని ఇచ్చే పంటలను సాగుచేయాలని కోరారు. మధ్యవర్తులు ఎవరైనా సాగుకు ప్రోత్సహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతేడాది పండిన పొగాకు నిల్వలను కొనుగోలుచేయకుండా ఈ ఏడాది సాగుచేయాలని ప్రోత్సహించటం క్షమించరాని నేరమన్నారు. రైతులు కంపెనీ వారి మాటలు వినిమోసపోవద్దని సూచించారు. పూర్తి బాధ్యతను గ్రామ, మండల స్థాయిలో వ్యవసాయాధికారులు పర్యవేక్షించాలని ఆదేశించామన్నారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
వెల్దుర్తి: స్కూల్ బస్సు.. ద్విచక్రవాహనం ఢీకొని ఓ యువకుడు తీవ్రంగా గాయపడి మృతిచెందిన సంఘటన మండలంలోని మండాది గ్రామ సమీపంలోని కానాగు వద్ద బుధవారం సాయంత్రం జరిగింది. మండలంలోని రచ్చమల్లపాడు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేశ్వర్లు (28) రచ్చమల్లపాడు నుంచి మాచర్లకు వస్తుండగా.. మాచర్ల పట్టణానికి చెందిన సెయింటాన్స్ స్కూల్ బస్సు విద్యార్థులను మండాది గ్రామంలో వదిలిపెట్టేందుకు వస్తోంది.. ఈక్రమంలో నేషనల్ హైవే 565 కానాగు బ్రిడ్జి మీద స్కూల్ బస్సు, ద్విచక్ర వాహనం ఢీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై ఉన్న ఆవుల వెంకటేశ్వర్లు 25 అడుగుల లోతు గల కానాగులో ఎగిరి పడ్డాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటేశ్వర్లు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.