
● యూరియా కష్టాలు!
కూటమి ప్రభుత్వం యూరియా కోసం అన్నదాతలను
రోడ్డెక్కించింది. పెదకాకాని మండలంలోని గోళ్ళమూడి గ్రామం ఉప్పలపాడు వ్యవసాయ సహకార పరపతి సంఘం పీఎసీఎస్ పరిధిలో ఉంది. వాస్తవానికి యూరియా అమ్మకాలు సొసైటీ వద్ద గానీ సమీపంలోని రైతు భరోసా కేంద్రం వద్ద గాని చేపట్టాలి. బుధవారం గోళ్ళమూడి గ్రామంలో లారీ రోడ్డుపై పెట్టి
అమ్మకాలు చేపట్టారు. ఆధార్‌కార్డు జిరాక్స్ తీసుకు వచ్చిన వారికి ఒక్కొక్కరికి 5 బస్తాల చొప్పున అమ్మకాలు చేశారు. 5 బస్తాలు యూరియా 1350 రూపాయల చొప్పున అమ్మకాలు జరిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా యూరియా కొరత వచ్చిందని కూటమి ప్రభుత్వంలో రోడ్డుపై లైన్లలో నిలబడి యూరియా
కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. లారీ లోడ్ యూరియా సొసైటీల ద్వారా
అమ్మకాలు చేపట్టాలంటే 40 లీటర్లు నానో (యూరియా లిక్విడ్) కూడా అమ్మకాలు చేపట్టాలని మార్క్‌ఫెడ్ అధికారులు ఒత్తిడి చేస్తూ యూరియా కొరత సృష్టిస్తున్నారని పలువురు అన్నదాతలు ఆరోపిస్తున్నారు. – పెదకాకాని