
సాఫ్ట్‌బాల్ బాలికల జిల్లా జట్టు ఎంపిక
సత్తెనపల్లి: ఉమ్మడి గుంటూరు జిల్లా సాఫ్ట్‌బాల్ సీనియర్ విభాగంలో జిల్లాస్థాయి బాలికల జట్టు ఎంపికలు సత్తెనపల్లి మండలం కొమెరపూడిలోని జెడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బుధవారం జరిగాయి. ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి 50 మంది బాలికలు హాజరయ్యారు. వీరిలో 15 మందిని జట్టుకు, మరో ఐదుగురిని స్టాండ్‌బైకు ఎంపిక చేశారు. ఎంపికై న వారిలో పల్లపాడుకు చెందిన సిహెచ్ అనిత, జి.సునందిని, ఎం.శృతి, సిహెచ్ పావని, బి.నందిని, కె.తేజస్విని, కె.చందన, ఇ.చంద్రిక, వి.లిద్య/ఎం.తిరుపతమ్మ, రొంపిచర్లకు చెందిన వి.శ్రీదేవి, పీవీఎన్ చంద్రిక, కొమెరపూడికి చెందిన బి.ప్రసన్న జ్యోతి, వినుకొండకు చెందిన ఆర్.రాగసుధ, క్రోసూరుకు చెందిన కె.దీవెన ఏంజల్, కేఎల్‌ఎస్ ప్రవల్లికలు ఉన్నారు. స్టాండ్ బైలుగా బి.శ్రీలక్ష్మి (రొంపిచర్ల), కె.సంజన (బ్రాహ్మణ కోడూరు), పి.శైలజ, జె.ధనలక్ష్మి, కె.తన్మయిసాయి (రామకృష్ణాపురం)లు ఎంపికయ్యారు. ఎంపికై న బాలికలు ఈనెల 30, 31 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. కార్యక్రమంలో సాఫ్ట్‌బాల్ జిల్లా సెక్రెటరీ పి.సామంతరెడ్డి, జాయింట్ సెక్రెటరీ నర్రా శ్రీనివాసరావు, ట్రెజరర్ జనార్దన్ రెడ్డి యాదవ్‌లు పాల్గొన్నారు. ఎంపికలకు సెలక్షన్ కమిటీ మెంబర్లుగా పీడీలు సైదయ్య, వెంకటేశ్వరరావు, సుబ్బారావులు వ్యవహరించారు. ఎంపికై న బాలికలకు గురువారం నుంచి కొమెరపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో శిక్షణ కార్యక్రమం జరుగుతుందని పాఠశాల హెచ్‌ఎం బి.విజయ తెలిపారు.