
మది నిండుగా.. తిరంగా పండుగ
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
పాల్గొన్న పలు పాఠశాలల విద్యార్థులు
ఆకట్టుకున్న పలు ప్రభుత్వ శాఖల శకటాలు
సాంస్కృతిక ప్రదర్శనల్లో విజేతలకు బహుమతులు అందించిన రాష్ట్ర మంత్రి లోకేష్
నగరంపాలెం: నగరంలోని పోలీసు కవాతు మైదానంలో 79వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం సందడిగా సాగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ముఖ్య అతిథిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. దేశభక్తి గీతాలకు జిల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అలరించాయి. తొలుత ప్రదర్శించిన జయహో.. జయ భారతీ జననీ వంటి దేశభక్తి గీతాలకు నృత్యాలు ఆహూతులను అలరించాయి. శ్రీ వెంకటేశ్వర బాలకుటీర్‌కు ప్రథమ బహుమతి, ఎస్‌ఎస్‌ఎన్ ప్రభుత్వ పాఠశాలకు (బ్రాడీపేట) రెండో బహుమతి , శ్రీపాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలకు (లక్ష్మీపురం)తృతీయ బహుమతులు లభించాయి. రాష్ట్ర మంత్రి నారా లోకేష్, జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి, జిల్లా సంయుక్త కలెక్టర్ భార్గవ్‌తేజ్, గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు బహుమతులను అందించారు. అనంతరం నిర్వహించిన ప్రభుత్వ శాఖల శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విద్యాశాఖకు ప్రథమ బహుమతి, డీఆర్‌డీఏ, మెప్మాకు ద్వితీయ బహుమతి, జీఎంసీకి తృతీయ బహుమతులు లభించాయి. పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మైదానంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను రాష్ట్ర మంత్రి లోకేష్ సందర్శించారు. ఆయా శాఖల ఉత్పత్తులు, సామర్థ్యం వివరాలను అధికారులు, సిబ్బంది ఆయనకు వివరించారు.

మది నిండుగా.. తిరంగా పండుగ

మది నిండుగా.. తిరంగా పండుగ