జిల్లా కోర్టులో స్వాతంత్య్ర వేడుకలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా కోర్టులో స్వాతంత్య్ర వేడుకలు

Aug 16 2025 7:05 AM | Updated on Aug 16 2025 7:05 AM

జిల్ల

జిల్లా కోర్టులో స్వాతంత్య్ర వేడుకలు

జిల్లా కోర్టులో స్వాతంత్య్ర వేడుకలు గుంటూరు రేంజ్‌ కార్యాలయ ఆవరణలో వేడుకలు

గుంటూరు లీగల్‌: జిల్లా కోర్టులో 79వ స్వాతంత్య్ర వేడుకలు అంగరంగ వైభవంగా శుక్రవారం జరిగాయి. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్‌ చక్రవర్తి, అతిథులుగా జిల్లా కోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. గుంటూరు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు శివ సూర్యనారాయణ జాతీయ జెండా ఆవిష్కరించారు. న్యాయవాదులకు, న్యాయవాద గుమస్తాలకు, కోర్టు సిబ్బందికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి మోతుకూరు శ్రీనివాసరావు, ఈసీ మెంబర్స్‌ బార్‌ అసోసియేషన్‌ తరఫున న్యాయవాదులకు అల్పాహార విందు ఏర్పాటు చేశారు.

నగరంపాలెం: గుంటూరు కలెక్టర్‌ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్‌ ఐజీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి జెండా ఎగురవేసి, గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయ, పోలీస్‌ సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్‌) హనుమంతు, ఆర్‌ఎస్‌ఐలు సంపంగిరావు, ప్రసాద్‌, అధికారలు, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

సమైక్యతే భారత దేశం శక్తి

జేసీ భార్గవ్‌ తేజ

గుంటూరు వెస్ట్‌: భారత దేశం అనేక మతాలు, కులాలు, జాతులు, భాషల సమ్మిళతమై ఉన్నప్పటికీ అంతా కలిసిమెలసి జీవిస్తూ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నామని జాయింట్‌ కలెక్టర్‌ ఏ.భార్గవ్‌ తేజ తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎన్నో కష్టనష్టాలకోర్చి నేడు దేశం అభివృద్ధి దిశగా కొనసాగుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రాభివృద్ధికి ఇతోధికంగా సహకరిస్తున్నారని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను యువత అధ్యయనం చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్వో షేఖ్‌ ఖాజావలి, స్పెషల్‌ డెప్యూటీ కలెక్టర్‌ లక్ష్మీ కుమారి, కలెక్టరేట్‌ ఏఓ పూర్ణచంద్రరావు పాల్గొన్నారు.

ఆటో బోల్తా : పలువురికి తీవ్ర గాయాలు

ఒకరి పరిస్థితి విషమం

మేడికొండూరు : మండల పరిధిలోని గుండ్లపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన మహిళలు నల్లపాడు పరిధిలో ఓ వివాహానికి వెళుతూ పాటిబండ్ల నుంచి వస్తున్న ఆటో ఎక్కారు. మేడికొండూరు పోలీస్‌ స్టేషన్‌ దాటిన తర్వాత గుండ్లపాలెం వద్ద ఎదురుగా గేదె అడ్డు రావడంతో డ్రైవర్‌ సడన్‌ బ్రేక్‌ వేయడంతో ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సిరిపురం గ్రామానికి చెందిన మిరియాల లిల్లీ రాణి తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆటో లాక్కొని వెళ్లడంతో పక్కటెముకలు దెబ్బతిన్నాయి. కుడి చేయితో పాటు ఒళ్లంతా గాయాలయ్యాయి. తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

జిల్లా కోర్టులో  స్వాతంత్య్ర వేడుకలు   1
1/2

జిల్లా కోర్టులో స్వాతంత్య్ర వేడుకలు

జిల్లా కోర్టులో  స్వాతంత్య్ర వేడుకలు   2
2/2

జిల్లా కోర్టులో స్వాతంత్య్ర వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement