వైభవంగా అమరేశ్వర స్వామి పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా అమరేశ్వర స్వామి పవిత్రోత్సవాలు

Aug 15 2025 6:44 AM | Updated on Aug 15 2025 6:44 AM

వైభవం

వైభవంగా అమరేశ్వర స్వామి పవిత్రోత్సవాలు

వైభవంగా అమరేశ్వర స్వామి పవిత్రోత్సవాలు అమరావతి: అమరావతిలోని బాలచాముండికా సమేత అమరేశ్వరస్వామి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండవ రోజు గురువారం ఉదయం అలయ అర్చకులు, వేద పండితులు మండప పూజ, దీక్ష హోమం, రుద్ర హోమం, పవిత్రధారణ, చండీ హోమం జరిపి హారతి, మంత్రపుష్పాలు సమర్పించారు. అనంతరం స్వామివార్లకు పట్టు పవిత్రములు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రేఖ మాట్లాడుతూ విజయవాడకు చెందిన యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో స్వామి వారి వార్షిక పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. శుక్రవారం ఉదయం ముగింపు సందర్భంగా 11 గంటలకు మహా పూర్ణాహుతి నిర్వహిస్తామని తెలిపారు. ఎయిమ్స్‌లో బ్రెస్ట్‌ ఫీడింగ్‌ క్యాబిన్‌ ఏర్పాటు టస్ట్‌ బోర్డు ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానం అగస్త్య లాంచీ ట్రయల్‌ రన్‌ విజయవంతం

మంగళగిరి టౌన్‌ : తాడేపల్లి రోటరీ క్లబ్‌ ఆధ్వర్యంలో ఎయిమ్స్‌ హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన అమృతధార బ్రెస్ట్‌ ఫీడింగ్‌ క్యాబిన్‌ను పాస్ట్‌ డిస్ట్రిక్‌ గవర్నర్‌ రాజ్యలక్ష్మి గురువారం ప్రారంభించారు. ఎయిమ్స్‌ ఆసుపత్రికి వచ్చే తల్లులు తమ చిన్నారులకు పాలు ఇవ్వడానికి సుమారు రూ. 1,50,000 విలువతో అమృతధార బ్రెస్ట్‌ ఫీడింగ్‌ క్యాబిన్‌ను ఏర్పాటు చేశామని క్లబ్‌ ప్రతినిధులు తెలిపారు. తల్లులు ఈ క్యాబిన్‌లో సౌకర్యవంతంగా కూర్చొని బిడ్డలకు పాలిచ్చేందుకు రెండు సోఫాలు ఏర్పాటు చేశామన్నారు. ఎయిమ్స్‌ వైద్యులు మాట్లాడుతూ క్యాబిన్‌ ఏర్పాటు చేయడం అభినందనీయమని, రోటరీ సేవలను కొనియాడారు. అనంతరం రోటరీ ప్రతినిధులు బాలింతలు, గర్భిణులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్‌ అసిస్టెంట్‌ గవర్నర్‌ పూర్ణచంద్రరావు, రోటరీ క్లబ్‌ తాడేపల్లి అధ్యక్షులు శెట్టి రామకృష్ణ, కార్యదర్శి శ్రావణి, కోశాధికారి నగేష్‌, పాస్ట్‌ ప్రెసిడెంట్‌ మున్నంగి వివేకానందరెడ్డి, క్లబ్‌ సభ్యులు శ్రీరామిరెడ్డి, కళ్ళం రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.

అమరావతి: ప్రఖ్యాత శైవ క్షేత్రమైన అమరావతిలోని అమరేశ్వరస్వామి వారి దేవస్థానానికి కొత్త ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు సహాయ కమిషనర్‌, దేవస్థానం కార్యనిర్వహణాధికారి కె.రేఖ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సేవా తపన కలిగిన భక్తులు, సేవాభావంతో ఉన్న దాతలు ట్రస్ట్‌ బోర్డులో సభ్యులుగా నియామకానికి దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. తమ దరఖాస్తులను ఫారం–1 నమూనాలో పూర్తి చేసి ఈ నెల 5వ తేదీ నుంచి 20 రోజులలోపు స్వామివారి దేవస్థానం సహాయ కమిషనరు, కార్యనిర్వహణాధికారి వారి కారాలయములో సమర్పించాలన్నారు. కొత్తగా ఏర్పడనున్న ట్రస్ట్‌ బోర్డు ఆలయ అభివృద్ధి, భక్తుల సౌకర్యాల మెరుగుదల, సేవా కార్యక్రమాల విస్తరణ నిర్వహిస్తుందన్నారు.

విజయపురిసౌత్‌: గత మూడు నెలలుగా నిలిచిపోయిన ఎంఎల్‌ అగస్త్య లాంచీ మరమ్మతులు పూర్తికావడంతో గురువారం నాగార్జున కొండకు ట్రయల్‌ రన్‌ నిర్వహించారు. గత ఆదివారం పర్యాటక శాఖ జీఎం చందన నాంచారయ్య ఆధ్వర్యంలో లాంచీ స్టేషన్‌లో అగస్త్య లాంచీ మరమ్మతు పనులను చేపట్టారు. అగస్త్య అందుబాటులోకి రావడంతో శ్రీశైలంతో పాటు నాగార్జున కొండకు పర్యాటకులను చేరవేసేందుకు అధికారులు సన్నద్ధం అయ్యారు. ఈ కార్యక్రమంలో లాంచీ యూ నిట్‌ మేనేజర్‌ వినయతుల్లా,పులుసు వీరారెడ్డి పాల్గొన్నారు.

వైభవంగా అమరేశ్వర  స్వామి పవిత్రోత్సవాలు 1
1/2

వైభవంగా అమరేశ్వర స్వామి పవిత్రోత్సవాలు

వైభవంగా అమరేశ్వర  స్వామి పవిత్రోత్సవాలు 2
2/2

వైభవంగా అమరేశ్వర స్వామి పవిత్రోత్సవాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement