
ప్రతిష్టాత్మకంగా స్వాతంత్య్ర దినోత్సవం
గుంటూరు వెస్ట్: ఎందరో మహనీయుల త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్య్ర దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపారు. స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్‌లో గురువారం సాయంత్రం కలెక్టర్‌తో పాటు, జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ్‌తేజ, జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్, జిల్లా అధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 79వ స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్లలో పాల్గొనడం అదృష్టంగా భావించాలని తెలిపారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జాతీయ పతాకావిష్కరణ చేపట్టనున్న నేపథ్యంలో సెక్యూరిటీ విషయంలో రాజీ పడొద్దని పోలీసు అధికారులకు సూచించారు. ముఖ్య అతిథులతో పాటు ఆహూతులు కూర్చునేందుకు ఏర్పాట్లు పటిష్టంగా చేయాలని తెలిపారు. వర్షాలు పడినప్పటికీ ప్రోగ్రాంలకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆకట్టుకునేలా శకటాలను రూపొందించాలని ఆదేశించారు. వేడుకలు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమై 12.15 గంటల వరకు జరుగుతాయని, అంతరాయం లేకుండా కార్యక్రమ ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ట్రాఫిక్‌తో పాటు, పార్కింగ్ నియంత్రణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆమె సూచించారు. మైదానం ప్రధాన గేటు ద్వారా కేవలం వీఐపీలను మాత్రమే అనుమతిస్తామని స్పష్టం చేశారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో కార్యక్రమ నిర్వహణకు కృషి చేయాలని ఆమె సూచించారు. అనంతరం మైదానం నలుమూలల కలియ తిరిగి ఏర్పాట్లు పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో డీఆర్వో షేక్ ఖాజావలి, ఆర్డీవో కె.శ్రీనివాసరావు, డెప్యూటీ స్పెషల్ కలెక్టర్ గంగరాజు, సీపీఓ శేషశ్రీ , ఐసీడీఎస్ పీడీ జ్ఞాన ప్రసూన, అడిషనల్ ఎస్పీ హనుమంతు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి