పలు స్టేషన్లలో రైళ్ల స్టాప్‌లు ఇవి.. | - | Sakshi
Sakshi News home page

పలు స్టేషన్లలో రైళ్ల స్టాప్‌లు ఇవి..

Aug 15 2025 6:44 AM | Updated on Aug 15 2025 6:44 AM

పలు స

పలు స్టేషన్లలో రైళ్ల స్టాప్‌లు ఇవి..

పలు స్టేషన్లలో రైళ్ల స్టాప్‌లు ఇవి.. లక్ష్మీపురం: గుంటూరు రైల్వే డివిజన్‌ మీదుగా ప్రయాణించే పలు రైళ్లను ప్రయాణికుల సౌకర్యార్థం ఈ కింద పేర్కొన్న స్టేషన్ల వద్ద నిలపనున్నట్లు సీనియర్‌ డీసీఎం ప్రదీప్‌ కుమార్‌ గురువారం తెలిపారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి సురక్షితమైన ప్రయాణం చేయాలని ఆయన సూచించారు. నదిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు తాడికొండ: కృష్ణానది వరద ఉధృతికి తుళ్ళూరు మండలం ఉద్దండరాయునిపాలెం గ్రామంలో బుధవారం గల్లంతైన ఇద్దరు యువకుల మృతదేహాల కోసం పోలీసులు గాలిస్తున్నారు. వీరిలో ఓ యువకుడి మృతదేహం సాయంత్రానికి లభ్యమైంది. వెంకటపాలెం నేషనల్‌ హైవే వంతెన పరిసర ప్రాంతంలో రెస్క్యూ టీమ్‌ సభ్యులు ఒకరి మృతదేహాన్ని కనుకున్నారు. మృతదేహం ప్రసంగి వీర ఉపేంద్రగా గుర్తించిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించారు. ఇసుక తోడే డ్రోజర్‌ను స్థానం మార్చేందుకు నదిలోకి దిగగా వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఇద్దరు గల్లంతయ్యారు. మృతుడి స్వగ్రామం తెనాలి వద్ద పెదపాలెం కాగా ప్రస్తుతం తాడేపల్లిలోని సీతానగరంలో నివాసం ఉంటున్నారు. ప్రణాళిక ప్రకారమే దారి దోపిడీ

● రైలు నంబర్‌ (12603) చైన్నె–హైదరాబాద్‌ రైలు ఈనెల 15వ తేదీ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిరియాలగూడ, నల్గొండ, రైల్వే స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుంది.

● (12733) తిరుపతి–లింగంపల్లి రైలు పిడుగురాళ్ల, నడికుడి, మిరియాలగూడ వయా గుంటూరు మీదుగా ఈనెల 15వ తేదీ నుంచి నడుస్తుంది.

● (17015) భువనేశ్వర్‌–సికింద్రాబాద్‌ రైలు ఈనెల 15వ తేదీ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిరియాలగూడ, నల్గొండ స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

● (17232) నాగర్‌సోల్‌–నరసాపూర్‌ రైలు వయా గుంటూరు డివిజన్‌ మీదుగా ఈ నెల 18వ తేదీ నుంచి సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిరియాలగూడ, నల్గొండ, స్టేషన్ల మీదుగా నడుస్తుంది.

● (17643) చంగల్‌పట్టు–కాకినాడ పోర్ట్‌ రైలు ఈనెల 15వ తేదీ నుంచి మంగళగిరి, న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

● (17216) ధర్మవరం జంక్షన్‌–విజయవాడ రైలు గిద్దలూరు, మార్కాపూర్‌ రోడ్‌ స్టేషన్ల మీదుగా ఈ నెల 15వ తేదీ నుంచి నడుస్తుంది.

● (17255) నరసాపూర్‌–లింగంపల్లి రైలు నల్గొండ స్టేషన్‌ మీదుగా ఈనెల 15వ తేదీ నుంచి ప్రయాణిస్తుంది.

● (17256) లింగంపల్లి–నరసాపూర్‌ రైలు నెల 15వ తేదీ నుంచి మంగళగిరి స్టేషన్ల మీదుగా ప్రయాణిస్తుంది.

● (17625) కాచిగూడ–రేపల్లె రైలు విజయవాడ స్టేషన్‌ మీదుగా ఈనెల 15వ తేదీ నుంచి, (17212) యశ్వంత్‌పూర్‌ జంక్షన్‌–మచిలీపట్నం వయా గుంటూరు నుంచి కంభం స్టేషన్‌ మీదుగా ప్రయాణిస్తుంది.

సాయంత్రానికి ఒక యువకుడి మృతదేహం లభ్యం

తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ

మేడికొండూరు : మేడికొండూరు మండల పరిధిలో దారి దోపిడీ పక్కా పథకం ప్రకారమే జరిగిందని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ అన్నారు. మేడికొండూరు పోలీస్‌ స్టేషన్‌లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 4న రూ.70 లక్షల నగదు, కారును అపహరించుకు వెళ్లినట్లు విజయవాడలో నివాసం ఉంటున్న జగదీష్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడికొండూరు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జగదీష్‌ స్నేహితుడు రంజిత్‌ ఈ నెల 4న బంగారపు మట్టి (లంకె బిందెలు లాంటివి) ఉందని జగదీష్‌ను నమ్మించి కేజీ రూ. 50 లక్షలు చొప్పున రెండు కేజీలు ఉందని చెప్పగా అందుకు జగదీష్‌ తన వద్ద రూ.70 లక్షలు మాత్రమే ఉన్నాయని, మిగతావి రెండు రోజుల తర్వాత ఇస్తానని చెప్పడంతో అందుకు రంజిత్‌ అంగీకరించాడు. జగదీష్‌ తన కారులో సత్తెనపల్లి వచ్చి అక్కడ ఉన్న రంజిత్‌ మరో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి బంగారపు మట్టిని పరిశీలించాడు. అనంతరం ఎవరి కారులో వాళ్ళు విజయవాడ బయలుదేరారు. మేడికొండూరు సమీపంలోకి రాగానే ఇద్దరు వ్యక్తులు జగదీష్‌ కారును అడ్డగించారు. పోలీస్‌ దుస్తులలో ఉన్న వారు విజిలెన్స్‌ అధికారులం అంటూ, జగదీష్‌ కారులో ఉన్న రూ.70 లక్షల నగదు, కారు తీసుకొని పరారయ్యారు. వెంటనే జగదీష్‌ స్నేహితులకు ఈ విషయం తెలిపి, సత్తెనపల్లి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ సతీష్‌ కుమార్‌ ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 13వ తేదీన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సోరియాసిమ్‌ కంపెనీ వద్ద కార్లను తనిఖీ చేస్తుండగా ఈ కేసులో నిందితులైన అంకుష్‌, మహాదేవులు వారి వాహనంతో వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. కారులో 40 లక్షల రూపాయల నగదు, ఆరు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్నేహితుడిని నమ్మించి మోసగించిన ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజమండ్రికి చెందిన రంజిత్‌ కోసం గాలిస్తున్నారు.

పలు స్టేషన్లలో రైళ్ల స్టాప్‌లు ఇవి.. 1
1/1

పలు స్టేషన్లలో రైళ్ల స్టాప్‌లు ఇవి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement