బలవర్థక ఆహారం

భవిష్యత్‌ తరాలకు
ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్దలో భాగంగా పౌష్టికాహారం ఇస్తూ విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి రాగిజావను సైతం అందిస్తోంది. బలవర్థకమైన ఈ పానీయం విద్యార్థుల్లో రక్తహీనతను నివారించి, ఏకాగ్రతను పెంచి, వారు చదువుల్లో ముందుండేలా ఉపకరిస్తుంది. జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్‌, ఇతర ప్రజాప్రతినిధులు హాజరై విద్యార్థులకు రాగిజావను అందించి లాంఛనంగా ప్రారంభించారు.

గుంటూరు వెస్ట్‌: భవిష్యత్‌ తరాలకు బలవర్థక ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ కృతనిశ్చయంతో ఉందని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జగనన్న గోరుముద్దలో భాగంగా రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈకార్యక్రమంలో స్థానిక కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ గతంతో పోల్చుకుంటే మధ్యాహ్న భోజన పథకాన్ని 80 శాతం పైగా విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటున్నారన్నారు. వారానికి మూడు రోజులు చక్కీ, ఐదు రోజులు గుడ్డు అందిస్తున్నామన్నారు. ఇకనుంచి చక్కీలేని రోజుల్లో వారానికి మరో మూడు రోజులు 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు రాగిజావ అందిస్తామన్నారు. ఇది చక్కని బల వర్థకమైన, పోషక విలువలున్న ఆహారమని చెప్పా రు. ఇక నుంచి పాఠశాలల్లో క్రమం తప్పకుండా ఇస్తారని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల న్నారు. దీని ద్వారా జిల్లాలో 1094 పాఠశాల్లో చదువుతున్న 1,17,560 విద్యార్థులకు ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని కలెక్టర్‌ వివరించారు.

జడ్పీ చైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను తన కుటుంబ సభ్యులుగా భావించి వారి బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, కేఎస్‌ లక్ష్మణరావు, కుమ్మరి శాలివాహన కార్పొరేషన్‌ చైర్మన్‌ మండేపూడి పురుషోత్తం, నెడ్‌క్యాప్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కొత్త చిన్నపరెడ్డి, డిప్యూటీ మేయర్‌ షేక్‌ సజీల, అసిస్టెంట్‌ కలెక్టర్‌ శివన్నారాయణ శర్మ, డీఈఓ శైలజ పాల్గొన్నారు.

రాగిజావ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, కేఎస్‌ లక్ష్మణరావు

కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌ రెడ్డి

పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని..

Read latest Guntur News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top