అంతరిక్షానికి నిచ్చెనౌతాను! | Sunita Williams Unspoken Feelings Revealed At Special Podcast | Sakshi
Sakshi News home page

అంతరిక్షానికి నిచ్చెనౌతాను!

Feb 7 2026 8:43 AM | Updated on Feb 7 2026 8:50 AM

Sunita Williams Unspoken Feelings Revealed At Special Podcast

ఇటీవలి తన భారతదేశ పర్యటనలో భాగంగా ‘నాసా’ వ్యోమగామి సునీతా విలియమ్స్‌ ‘అన్‌పాలిటిక్స్‌’ పాడ్‌ కాస్ట్‌లో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో, మునుపెన్నడూ వెల్లడించని విషయాలను, భావోద్వేగాలను సునీత పంచుకున్నారు.

‘ద మార్షియన్‌’ సినిమా గుర్తొచ్చింది!
‘‘మేము అంతరిక్ష నౌకను అంతరిక్ష కేంద్రంతో కలుపు తున్న (డాకింగ్‌) సమయంలో ఐదు ఇంజిన్లు ఆగి పోయాయని తెలిసి ఆందోళన కలిగింది. అది మా పుస్త కాల్లో ఎక్కడా లేని ఒక పెద్ద సాంకేతిక సమస్య. కానీ ఒక పెద్ద సమస్యను ఎలా పరిష్కరించాలి? చిన్న చిన్న భాగా లుగా చేసుకుని ఒక్కొక్కటిగా పరిష్కరించాలి. అప్పుడు నాకు ‘ద మార్షియన్‌’ సినిమా గుర్తొచ్చింది. పరిస్థితులు భయంకరంగా ఉన్నప్పుడు, ఆ సమస్య ఎంత పెద్దదని చూడకూడదు; మన ముందున్న చిన్న పని మీద మాత్రమే దృష్టి పెట్టాలి. పనిలో పడిపోతే భయపడటా నికి సమయం ఉండదు.

కల్పన కుటుంబంతో మూడు నెలలు
‘కొలంబియా’ ప్రమాదం జరిగిన తర్వాత, నేను హ్యూస్టన్‌లోని కల్పన (చావ్లా) కుటుంబంతో మూడు నెలల పాటు గడిపాను. ప్రతిరోజూ ఉదయం 9 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు వారితోనే ఉండేదాన్ని. అది ఊహించని, విపత్కాలం. వారికి ఆ బాధ నుండి ఉపశమనం కలిగించాలని అనుకున్నాను. ఆ మూడు నెలల్లో మేము ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కల్పనలోని సుగుణాల గురించి నేను వారికి చెప్పాను. ఇండియాలో కల్పన చిన్ననాటి కథలను వారు నాకు చెప్పారు. అది మా అందరికీ ఎంతో ఊరటనిచ్చింది. 

రానున్న కాలమంతా చంద్రుడిదే!
‘‘నా రిటైర్మెంట్‌ గురించి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకంటే ఈ అధ్యాయాన్ని ముగించడానికి ఇదే సరైన సమయం అని నా భావన. నా కెరీర్‌ అంతా అంతరిక్ష కేంద్రంతోనే సరిపోయింది కానీ, రాబోయే కాలం చంద్రుడికి సంబంధించింది. ఇప్పుడు నాకంటే చిన్న వయస్సులో ఉన్నవాళ్లు బాధ్యతలు చేపట్టారు. వారు చరిత్ర సృష్టించటానికి సిద్ధంగా ఉన్నారు. ఇకపై ఆ సీటులో నేనే కూర్చోవాలని లేదు. నేనేమీ అద్భుతాలు చేసే మెజీషియన్‌ని కాదు. నేను కూడా వారిలో ఒకరిని మాత్రమే. వారు పైకి ఎదగడానికి నేను ఒక నిచ్చెనలా తోడ్పడాలని కోరుకుంటున్నాను. (సునీత 27 ఏళ్ల కెరీర్‌ తర్వాత ‘నాసా’ నుంచి 2025 డిసెంబర్‌ 27న రిటైర్‌ అయ్యారు. ఆ సంగతిని నాసా, సునీత ఇండియా పర్య టనలో ఉండగా 2026 జనవరి 21న ప్రకటించింది.)

అదొక అందమైన జీవ ప్రవాహం!
‘‘అంతరిక్షం నుండి భారతదేశాన్ని చూడటం అద్భుతంగా ఉంటుంది, ముఖ్యంగా రాత్రిపూట. మనం పైనుండి వెళ్తున్నప్పుడు, నగరాలన్నీ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక ‘నరాల వ్యవస్థ’ లాగా కనిపిస్తాయి. మా నాన్న మైక్రోస్కోప్‌ కింద చూసే బొమ్మల్లా ఉంటా యవి. ముంబై తీరంలో చేపల పడవలు వెలుగుతున్న దీపాల్లా కనిపిస్తాయి. తీరం వెంబడి కాంతులు ఒక ముత్యాల హారంలా మెరుస్తాయి. ఇవన్నీ చూస్తుంటే మా కుటుంబ చరిత్ర, ఈ దేశంతో మాకున్న అను
బంధం నాకు బలంగా గుర్తొస్తాయి. చూడటానికి అది ఒక అందమైన జీవప్రవాహంలా అనిపిస్తుంది.

పెంపుడు కుక్క ప్రేమ జ్ఞాపకాలు
‘‘నా చేతిపై ఉన్న ఈ పాదముద్రల పచ్చబొట్లు మాపెంపుడు కుక్కవి. ఇవి నా దగ్గర 2001 నుండి 2017 వరకు ఉన్న ‘జాక్‌ రస్సెల్‌ టెర్రియర్‌’ రకానికి
చెందిన నా పెంపుడు కుక్క అసలు పాద ముద్రలు. అది నాతో పాటు శిక్షణ కోసం రష్యాకు కూడా వచ్చింది. నేను పరిగెత్తేటప్పుడు లేదా ఈత కొట్టేటప్పుడు దానిని చూస్తుంటే, నాకు ఇంటితో ఉన్న అనుబంధం గుర్తు కొస్తుంది. అంతరిక్షంలో ఉన్నప్పుడు, జంతువులు మనకు స్వచ్ఛమైన నిజాయితీ గల ప్రేమను గుర్తు చేస్తాయి. మన మనుషుల్లాగా వాటికి మనసులోగందరగోళం ఉండదు. నా శరీరంపై ఉన్న ఈ గుర్తులు నన్ను ఎప్పుడూ నా ఇంటి జ్ఞాపకాలతో, ఆ స్వచ్ఛతతో కలుపుతూ ఉంటాయి.
-ఎడిటోరియల్‌ టీమ్‌

Advertisement
 
Advertisement
Advertisement