కొత్త తరానికి సరికొత్త చదువులు

Rama Vishwanathan Article On National Education Policy Andhra Pradesh - Sakshi

మెడిసిన్‌ విద్యార్థి దేశ చరిత్రను చదవకూడదా? ఇంజనీరింగ్‌ విద్యార్థికి తెలుగు సాహిత్యం అక్కర్లేనిదా? ఆటపాటలు, ఇతర నైపుణ్యాలు కూడా చదువులో భాగం కావా? ఇటీవలే ఏడాది పూర్తి చేసుకున్న ‘జాతీయ విద్యా విధానం–2020’ ఇలాంటి వినూత్న ఆలోచనలను ప్రోత్సహిస్తోంది. పునాది దశ నుంచే బాలలను సర్వతోముఖంగా అభివృద్ధి చేసేలా కొత్త పాఠాలను రచిస్తోంది. అయితే ఈ కొత్త విధానం మీద కొన్ని అనుమానాలూ కలుగుతున్నాయి. పెద్ద ఎత్తున మార్పులు చేసేటప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయా అన్న ఆలోచన తలెత్తుతుంది. ఈ వ్యవస్థల రూపకల్పనకు భారీగా నిధులు అవసరం. పాలకులు అన్ని నిధులను కేటాయించగలరా అన్నది మరో అనుమానం. అయితే, జాతీయ విద్యా విధానంలోని మంచిని ముందుగానే స్వీకరించిన ఏపీ ప్రభుత్వం అంతకంటే మెరుగైన విద్యను అందించే దిశగా అవిరళ కృషి చేస్తోంది.

దేశవ్యాప్తంగా జాతీయ విద్యా విధానం ప్రవేశపెట్టి ఒక ఏడాది పూర్తయింది. ఆంధ్రప్రదేశ్‌ వంటి అనేక రాష్ట్రాలు ఇప్పటికే జాతీయ విద్యా విధానం అమలు దిశగా పయనిస్తున్నాయి. ఈ సందర్భంగా జాతీయ విద్యా విధానంలోని ముఖ్యాంశాలను చర్చిద్దాం.  వాస్తవానికి స్వాతంత్య్రం తర్వాత చాలాకాలం పాటు మన ప్రభుత్వాలు విద్యా విధానాన్ని సమగ్రంగా పట్టించుకోలేదు. 1960వ దశకంలో ఏర్పడిన కొఠారీ కమిషన్‌ సిఫార్సులు చాలా వరకు అమలు జరగలేదు. 80వ దశకంలో అప్పటి రాజీవ్‌గాంధీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విద్యా వ్యవస్థే ఇప్పటిదాకా కొనసాగుతోంది. 30 ఏళ్లకు పైగా కొనసాగిన మూస విధానాల్ని అధిగమించేందుకు ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే మాజీ కేబినెట్‌ కార్యదర్శి సుబ్రహ్మణ్యం నేతృ త్వంలో కమిటీ రూపుదిద్దుకొన్నది. ఆ కమిటీ ఇచ్చిన ప్రాథమిక నివే దిక ఆధారంగా ఇస్రో మాజీ చైర్మన్, శాస్త్రవేత్త కస్తూరి రంగన్‌ ఆధ్వ ర్యంలో కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ దేశవ్యాప్తంగా పర్యటనలు జరిపి, లక్షల సంఖ్యలో సలహాలు, సూచనలు స్వీకరించింది. నిపుణు లైన కమిటీ సభ్యులు ఇవన్నీ అధ్యయనం చేసి ఈ విద్యా విధానం ముసాయిదాకు రూపకల్పన చేశారు. దీని ఆధారంగా రూపొందినదే జాతీయ విద్యా విధానం 2020. ఇందులో అనేక ముఖ్యమైన ప్రతి పాదనలు కనిపిస్తాయి. ఇప్పటిదాకా ఉన్న 10+2+3 విధానాన్ని అప్‌ గ్రేడ్‌ చేసి, 5+3+3+4 అనే 4 దశలుగా మారుతాయి. 3 నుంచి 18 ఏళ్ల వయసు దాకా నిరంతరాయత ఉంటుంది.

ప్రాథమిక విద్యలో మూడో సంవత్సరం నిండినప్పటినుంచే అభ్యసనం మొదలవుతుంది. వాడుక భాషలో చెప్పుకొనే నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీలతో పాటు 1, 2 తరగతులు ఉంటాయి. అన్ని వర్గాల పిల్లలు ఆడుతూ పాడుతూ నేర్చుకొనే మాదిరిగా కరిక్యులమ్‌ రూపొందిస్తారు. దీని కోసం అందుబాటులో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలను, సమీప విద్యాలయాలకు అనుసంధానం చేస్తారు. ఈ విధానాన్ని ఎర్లీ చైల్డ్‌ హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ (ఈసీసీఈ) అని పిలుస్తారు.  ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం నాణ్యమైన భోజనం అందిస్తారు. చిన్నారుల వయసుకి తగినట్లుగా తరగతి వేళలను ఏర్పాటు చేయడం, ఆహ్లాదకర వసతులు కల్పించటం జరుగుతుంది. 

తయారీ దశలో పిల్లలను చదువు, సబ్జెక్టుల పట్ల అభిరుచి పెంచు కొనేట్లుగా తీర్చిదిద్దుతారు. పిల్లలకు చక్కటి మౌలిక వసతులు అందు బాటులోకి వస్తాయి. పాఠశాల విద్యా ప్రమాణాలను అధ్యయనం చేసేందుకు రాష్ట్ర స్థాయిలో చట్రం ఏర్పాటవుతుంది. పిల్లలకు పఠనంలో ఆసక్తి పెంచేందుకు జాతీయ పుస్తక ప్రోత్సాహ విధానాన్ని అమలు చేస్తారు. పాఠశాలలకు పెద్ద ఎత్తున పుస్తకాలు అందజేస్తారు. 

మాధ్యమిక దశలో విద్యార్థులకు చదువు, సబ్జెక్టులు, అంశాల పట్ల స్పష్టమైన దృక్కోణం ఏర్పడుతుంది. కరిక్యులమ్, కో కరిక్యు లమ్, అదనపు కరిక్యులమ్‌ అనే గోడలను తప్పించే ప్రయత్నం జరు గుతుంది. చదువుతో పాటు ఆటపాటలు, సంగీతం, యోగా, క్రాఫ్ట్స్‌ వంటి అంశాలను మేళవించేందుకు పెద్ద పీట వేస్తారు. అన్ని అంశా లను కరిక్యులమ్‌లోనే చేర్చటం ద్వారా ఆయా అంశాలలో చురుకైన పిల్లలకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. చక్కటి క్రీడాకారులు, కళా కారులుగా పిల్లలను తీర్చిదిద్దేందుకు ప్రాతిపదిక ఏర్పడుతుంది.

సెకండరీ దశలో టీనేజ్‌ పిల్లల మనస్తత్వానికి అనుగుణంగా కరిక్యులమ్‌కు మెరుగులు దిద్దుతారు. సబ్జెక్టులతో పాటు భాష, వ్యక్తిత్వ నిర్మాణం వంటి వాటి మీద దృష్టి పెడతారు. వృత్తి విద్యా నైపుణ్యాలను పరిచయం చేస్తారు. ఇది రెండు విధాలుగా ఉపయోగ పడుతుంది. పేదలకు వృత్తి విద్య ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగ వుతాయి. ధనికుల పిల్లలకు వివిధ వృత్తుల పట్ల గౌరవం ఏర్పడు తుంది. ఇదంతా పాఠశాల విద్యలో వచ్చే మార్పులు. అయితే ఈ క్రమంలో మూడు, నాలుగుసార్లు పిల్లల అభ్యసన స్థాయిని పరీ క్షించటం జరుగుతుంది. ఇందుకోసం జాతీయ మూల్యాంకన కేంద్రాన్ని అందుబాటులోకి తెస్తారు. దీని ద్వారా 2, 5, 8 తరగతు లలో విద్యార్థుల స్థాయిని అంచనా వేస్తారు. 10, 12 తరగతులలో బోర్డు పరీక్షలు ఉంటాయి.  అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతర సిబ్బందికి ఈ నూతన విధానం కోసం తగిన శిక్షణ ఇస్తారు. ప్రస్తుత విద్యా వ్యవస్థలో పనిచేస్తున్న సిబ్బంది మొత్తాన్నీ కొత్త మార్గంలోకి ఉత్తేజ పరుస్తారు.

ఇక, ఉన్నత విద్యలో అద్భుతమైన మార్పులు చోటుచేసు కుం టాయి. సైన్స్‌ విద్యార్థి అవే సబ్జెక్టులు చదవాలి, ఆర్ట్స్‌ విద్యార్థి ఇలాగే ఉండాలన్న కట్టుబాట్లు ఉండవు. ఇంజనీరింగ్‌ విద్యార్థి తెలుగు లిటరేచర్‌ తీసుకోవచ్చు. మెడిసిన్‌ విద్యార్థికి చరిత్ర అందుబాటులోకి వస్తుంది. విద్యార్థులకు ఏ ఏ సబ్జెక్టులు ఆసక్తి ఉంటే ఆయా కోర్సులను చదువుకోవచ్చు. 21వ శతాబ్దికి అవసరం అయ్యే మాదిరిగా ఉన్నత విద్యను సమూలంగా మార్పులు చేస్తారు. చదువుతో పాటు టెక్నా లజీకి పెద్దపీట వేస్తారు. అధునాతన సబ్జెక్టులను అందరికీ అందు బాటులోకి తెస్తారు. దేశంలోని 900 విశ్వవిద్యాలయాలు, 40 వేల కళాశాలలను సమీకృత విద్యాలయాలుగా మారుస్తారు. టెక్నాలజీ, పరిశోధనలకు పెద్ద పీట వేయటం జరుగుతుంది. ఒక్కో సంవత్సరం కోర్సు పూర్తవుతుండగానే పిల్లలకు తగిన సర్టిఫికెట్‌ను బహూక రిస్తారు. ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తారు. ప్రతీ జిల్లాలో మల్టీ డిసిప్లీనరీ యూనివర్సిటీ లేక కళాశాలలు ఏర్పాటవుతాయి. ఉపాధ్యాయులను తీర్చిదిద్దేందుకు నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సులను ప్రారంభిస్తారు. ప్రతీ టీచర్‌కు ఏటా 50 గంటల శిక్షణ తప్పనిసరి. 

మొత్తంగా చెప్పాలంటే ప్రస్తుత విద్యా వ్యవస్థలోని అనేక లోపాలకు ఈ జాతీయ విద్యా విధానం పరిష్కారం చూపుతుంది. ఇది అమలు చేయటం ద్వారా టీచర్లను, అంగన్‌వాడీ కార్యకర్తల్ని తొల గించటం జరగదు. పాఠశాలల్ని మూసేయటం, పిల్లల్ని చదువుకు దూరం చేయటం జరగదు. ధనవంతుల పిల్లలతో సమానంగా నిరు పేదల పిల్లలకు కూడా నాణ్యమైన విద్యను అందించటం జరుగు తుంది. అయితే ఈ కొత్త విధానం మీద కొన్ని అనుమానాలు కలుగు తున్నాయి. పెద్ద ఎత్తున మార్పులు చేసేటప్పుడు అన్నీ సక్రమంగా జరుగుతాయా అన్న ఆలోచన తలెత్తుతుంది. ఈ వ్యవస్థల రూప కల్పనకు భారీగా నిధులు అవసరం. అంత మొత్తంలో ప్రభుత్వాలు నిధులను కేటాయించగలవా అన్నది మరో అనుమానం. వివిధ రకాల వృత్తి విద్యలను ఏకం పాకం చేసేస్తే గందరగోళం ఏర్పడుతుందనేది మరో అనుమానం. వీటన్నింటికీ రాబోయే కాలమే జవాబు చెబుతుంది.

రమా విశ్వనాథన్‌
విద్యాభారతి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక క్షేత్ర ప్రచార కన్వీనర్‌ ‘ మొబైల్‌ : 92901 93417 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top