ఈల వేశారు జనం! వెల్లివిరిసింది జ(గ)నం!

Dr.Ram Kesari's Poetry On YS Jagan Mohan Reddy - Sakshi

అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ముఖ్యమంత్రి జగన్‌ YSRCP సిద్ధం సభ కొత్త ఊపు తీసుకొచ్చింది. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగబోతున్న ఎన్నికల యుద్ధంలో పేదవాడి భవిష్యత్‌ కోసం వారి తరఫున నిలబడటానికి మీరంతా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపు­ని­వ్వడం, ముఖ్యమంత్రి స్పీచ్‌ కోసం లక్షలాది మంది తరలి రావడం పట్ల చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు.

ఖాళీ అయ్యింది బంగాళా ఖాతపు జల సంద్రం 
రాయల సీమలో మోహరించింది జన సముద్రం 

ఈల వేశారు జనం వెల్లివిరిసింది జ(గ)నం 
అదొక జగన ఘన ప్రభంజనం, ఆడబిడ్డలకు అన్న అంజనం

జగనన్న కలిగించాడు ఎంతో ప్రమోదం 
ప్రజలందరికీ అన్న సర్వ ఆమోదం

- డాక్టర్‌ రాం కేసరి, అమెరికా

సభలో సీఎం జగన్‌ ఏమన్నారంటే..

జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చింది. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ప్రతి సీమ బిడ్డకూ మీ జగన్‌ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. పెత్తందార్లకు – పేదలకు మధ్య సంగ్రామం. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపుతట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్‌లో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మళ్లీ గెలవాలి. పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాసు పట్టుకొని సైకిల్‌పై వస్తుంది. పేదల రక్తం తాగేస్తుంది. 

– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

whatsapp channel

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top