పర్పుల్‌ కలర్‌ ఎందుకు? | Sakshi
Sakshi News home page

పర్పుల్‌ కలర్‌ ఎందుకు?

Published Wed, Mar 6 2024 3:47 AM

Women Day 2024: Why Is Purple Associated With This Day - Sakshi

ఉమెన్స్‌ డే సందర్భంగా కనిపించే పోస్టర్లు, ప్రచార సందేశాలకు పర్పుల్‌ కలర్‌ను ఉపయోగిస్తారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి ఈ పర్పుల్‌ కలర్‌కి సంబంధం ఏమిటి? ఆ విశేషాలు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోగోలు, పోస్టర్లు, ప్రచార చిత్రాల్లో పర్పుల్‌ కలర్‌ కనిపిస్తుంది. గూగుల్‌ కూడా తన లోగోలో ఈ రంగే వాడుతుంది. ర్యాలీల్లో మహిళలు ఈ రంగు దుస్తులు ధరిస్తారు. దీనికి కారణం ఏమిటి? పర్పుల్‌ రంగు హుందాతనానికి గుర్తు. దీనిని దర్పానికి, సృజనాత్మకతకి, ఆధ్యాత్మికతకు సంకేతంగా ఉపయోగిస్తారు. ఒకప్పుడు అమెరికాలో మహిళలు ఓటు హక్కు కోసం ఉద్యమించినప్పుడు తెలుపు, ఆకుపచ్చ, పర్పుల్‌ రంగులను ఉద్యమంలో ఉపయోగించారు. తెలుపు స్వచ్ఛతకు, ఆకుపచ్చ ఆశకు, పర్పుల్‌ హుందాతనానికి చిహ్నంగా వ్యాఖ్యానించారు.

అప్పటి నుంచి పర్పుల్‌ స్త్రీల ఉద్యమరంగు అయ్యింది. ఆ రోజుల్లో పర్పుల్‌ రంగును ‘డై’ చేయాలంటే ఖర్చుగా ఉండేది. కులీన వంశస్తుల స్త్రీలే పర్పుల్‌ రంగు గౌన్లు ధరించేవారు. ‘స్త్రీల అమూల్యతను’ తెలపడానికి పర్పుల్‌ ఆ విధంగా చిహ్నమైంది. మరో విషయం ఏమిటంటే పింక్, బ్లూ కలర్స్‌ కలిపితే పర్పుల్‌ అవుతుంది. పింక్‌ కలర్‌ స్త్రీత్వానికి గుర్తు అయితే బ్లూ పురుష సామర్థ్యానికి చిహ్నం. స్త్రీ పురుషులు సమానం అని చెప్పడానికి పర్పుల్‌ కచ్చిత నిర్వచనంగా నిలుస్తుంది. మార్చి 8న అంతర్జాతీయ దినోత్సవాన్ని పర్పుల్‌ కలర్‌తో సెలబ్రేట్‌ చేసుకోవాలి. ఆఫీసుల్లో హెచ్‌ఆర్‌లో ఈ కలర్‌ రిబ్బన్స్‌ అలంకరించడం ద్వారా మహిళా ఉద్యోగుల పట్ల వారి ఆకాంక్షల పట్ల సంఘీభావం తెలపాలి. 

Advertisement

తప్పక చదవండి

Advertisement