సంగీతానికి సరిహద్దులు లేవోయి! | Woman Dances To London Thumakda Outside Big Ben | Sakshi
Sakshi News home page

సంగీతానికి సరిహద్దులు లేవోయి!

Apr 30 2023 3:48 AM | Updated on Apr 30 2023 4:15 AM

Woman Dances To London Thumakda Outside Big Ben - Sakshi

దేశానికి సరిహద్దులు ఉండొచ్చుగానీ సంగీతానికి ఉండవు అని మరోసారి గుర్తు చేసిన ఈ వీడియో అంతర్జాలంలో వైరల్‌ అవుతూ ‘ఆహా’ అనిపిస్తోంది. విషయం ఏమనగా... భారతీయ యువతి ఒకరు లండన్‌లోని బిగ్‌బెన్‌(గ్రేట్‌ బెల్‌ ఆఫ్‌ ది గ్రేట్‌ క్లాక్‌ ఆఫ్‌ వెస్ట్‌మినిస్టర్‌)కు సమీపంలో బాలీవుడ్‌ సినిమా ‘క్వీన్‌’లోని ‘లండన్‌ తుమ్ఖడా’ పాటకు డ్యాన్స్‌ చేయడం మొదలుపెట్టింది.

చుట్టుపక్కల జనాలు గుంపులుగా చేరి ఆ డాన్స్‌ను ఆసక్తితో చూడడం మొదలుపెట్టారు. సీన్‌ ఇదే అయితే ఈ సీన్‌ గురించి చెప్పడానికి అంత సీన్‌ ఉండేది కాదు. అయితే హిందీ భాషలో ఒక్క ముక్క కూడా అర్థం కాని ఆ జనాలు యువతితో పాటు డ్యాన్స్‌ చేయడం కోసం కాలు కదపడమే విషయం. . ‘ఇలాంటి దృశ్యాన్ని లండన్‌లో మాత్రమే చూడగలం’ అనే కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసిన ఈ వీడియో వైరల్‌ అయింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement