breaking news
young Indian woman
-
సంగీతానికి సరిహద్దులు లేవోయి!
దేశానికి సరిహద్దులు ఉండొచ్చుగానీ సంగీతానికి ఉండవు అని మరోసారి గుర్తు చేసిన ఈ వీడియో అంతర్జాలంలో వైరల్ అవుతూ ‘ఆహా’ అనిపిస్తోంది. విషయం ఏమనగా... భారతీయ యువతి ఒకరు లండన్‌లోని బిగ్‌బెన్(గ్రేట్ బెల్ ఆఫ్ ది గ్రేట్ క్లాక్ ఆఫ్ వెస్ట్‌మినిస్టర్)కు సమీపంలో బాలీవుడ్ సినిమా ‘క్వీన్’లోని ‘లండన్ తుమ్ఖడా’ పాటకు డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. చుట్టుపక్కల జనాలు గుంపులుగా చేరి ఆ డాన్స్‌ను ఆసక్తితో చూడడం మొదలుపెట్టారు. సీన్ ఇదే అయితే ఈ సీన్ గురించి చెప్పడానికి అంత సీన్ ఉండేది కాదు. అయితే హిందీ భాషలో ఒక్క ముక్క కూడా అర్థం కాని ఆ జనాలు యువతితో పాటు డ్యాన్స్ చేయడం కోసం కాలు కదపడమే విషయం. . ‘ఇలాంటి దృశ్యాన్ని లండన్‌లో మాత్రమే చూడగలం’ అనే కాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో వైరల్ అయింది. -
షార్జాలో భారత యువతి అరెస్టు
* తల్లికి చెందిన రూ.5 కోట్ల బంగారంతో పారిపోవడానికి యత్నం * యువతితోపాటు పాక్‌కు చెందిన ఆమె స్నేహితుడిని అరెస్టు చేసిన పోలీసులు దుబాయ్: తల్లికి చెందిన 20 కిలోల బంగారు ఆభరణాలు తీసుకుని పారిపోవడానికి ప్రయత్నించిన ఓ భారత యువతిని, పాకిస్తాన్‌కు చెందిన ఆమె స్నేహితుడిని షార్జా పోలీసులు అరెస్టు చేశారు. వారిద్దరూ కలిసి మరో దేశంలో స్థిరపడేందుకు పారిపోవాలని నిర్ణయించుకున్నట్టు విచారణలో తేలింది. భారత్‌కు చెందిన ఓ మహిళ తన బంగారు ఆభరణాలను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన అనుమతి పొందేందుకు షార్జా కస్టమ్స్ డిపార్ట్మెంట్కు వెళ్లారు. ఆ సమయంలో ఆమె కుమార్తె (20) కారులోనే ఉంది. ఆ మహిళ తిరిగొచ్చేసరికి కుమార్తె కనిపించలేదు. దీంతో తన కుమార్తె కనిపించడంలేదని ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే ఆ యువతి కిడ్నాప్ కాలేదని, దాదాపు రూ.5 కోట్ల విలువైన బంగారు నగలు తీసుకుని స్నేహితుడైన పాక్ జాతీయుడు మామ్ దగ్గరకు వెళ్లిపోయినట్టు పోలీసులు కనుగొన్నారు. ఇద్దరూ కలిసి మరో దేశానికి పారిపోవాలని ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. విచారణలో ఇరువురూ నేరం అంగీకరించారని పోలీసులు వెల్లడించారు.