గుండెపోటు వస్తుందో లేదో ముందే తెలుసుకోండి..ఆ ట్యాబ్లెట్‌ దగ్గర ఉంచుకోండి | What Are The Symptoms Of Heart Attack And What Precautions Should Be Taken After Getting A Stunt? - Sakshi
Sakshi News home page

Heart Attack Symptoms And Risk: గుండెపోటు వస్తుందో లేదో ముందే తెలుసుకోండి..ఆ ట్యాబ్లెట్‌ దగ్గర ఉంచుకోండి

Published Tue, Oct 3 2023 4:59 PM

What Are The Heart Attack Symptoms And Risk - Sakshi

గుండెలో కొవ్వు పేరుకుపోవడం, ఫ్యాట్స్‌ అధికంగా ఉన్న ఆహారం తినడం, అధిక బరువు, డయాబెటిస్‌ రోగుల్లో ఇన్సులిన్‌ రెసిస్టన్స్‌ కారణాల వల్ల సంభవించవచ్చు. పైన పేర్కొన్న కొన్ని కారణాల వల్ల గుండె కండరాల్లో కొవ్వు అధికంగా పేరుకునేటట్లు చేస్తుంది. ఇలా పేరుకుపోయిన కొవ్వు గుండెను బలహీనపరిచి హార్క్‌ రిస్క్‌ను పెంచుతుంది. ముందే లక్షణాలను గుర్తించడం వల్ల జాగ్రత్తపడొచ్చు. 


హార్ట్‌ ఎటాక్‌ వచ్చేముందే శరీరం కొన్ని హెచ్చరికలను మనకు పరోక్షంగా పంపుతుంది. కానీ వాటిని మనం సాధారణంగా భావించి పెద్దగా నోటిస్‌ చేయము. పల్ప్ టేషన్ కొద్ది మెట్లు ఎక్కినా ఆయసం వస్తుంది. కుడి చేతిని పైకి ఎత్తడంలో ఇబ్బంది,నొప్పి, చెమట పడుతుంది. ఒక వయసు దాటిన వాళ్లలో ఈ లక్షణాలు కనిపిస్తే ఇంట్లో "సార్బిట్రేట్ " మాత్రలు( లైఫ్ సేవింగ్ మాత్రలు చాలా తక్కువ ఖరీదు) అందుబాటులో ఉంచుకోవాలి. ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా ఆ మాత్ర ఒకటి నాలుక కింది భాగంలో ఉంచుకోవాలి, మింగకూడదు. డాక్టర్‌ను వెంటనే సంప్రదించాలి. 


స్టంట్ వేయించుకున్నాక ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ?

స్టంట్‌ ప్రక్రియ ముగిశాక, మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి, భవిష్యత్తులో అడ్డంకులు ఏర్పడకుండా జాగ్రత్తలు పాటించాలి. అవేంటో చూద్దాం. 
►  ఆస్పిరిన్,క్లోపిడోగ్రెల్ వంటి యాంటీ ప్లేట్‌లెట్ మందులతో సహా డాక్టర్‌ సూచించిన మందులను వాడండి. 
► ధూమపానం..అనేక జబ్బులకు కారకం. కాబట్టి మందు, సిగరెట్‌ వంటివి మానేయడం మంచిది. 
► కొలెస్ట్రాల్‌ తక్కువ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్, తక్కువ కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు తీసుకోవచ్చు. 
► ఊబకాయం గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి ఆరోగ్యకరమైన బరువు ఉంచుకోవడం ముఖ్యం. 
► క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. ఇది మీ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
► దీర్ఘకాలిక ఒత్తిడి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. ధ్యానం, యోగా వంటివి ఒత్తిడిని తగ్గిస్తుంది. 


-నవీన్ రోయ్ 
ప్రముఖ ఆయుర్వేద నిపుణులు

Advertisement
 
Advertisement
 
Advertisement